తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి… షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తేవాలనే కోరిక ఉందని… ఏ విధంగా తేవాలి ఎప్పుడూ తేవాలి అనేది ఇంకా చర్చలోనే ఉందని చెప్పారు. లోటస్ పాండ్‌లోని ఆమె నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ముఖ్యులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని… మిగతా జిల్లాల వారితో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో వైసీపీతోనే కొనసాగుతారా… కొత్త పార్టీ పెడతారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు… ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా… విద్యార్థులు ఉచితంగా చదువుతున్నారా అని అంటూ మీడియా ప్రతినిధులను షర్మిలా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన తోడబుట్టిన అన్న అని, ఆయన ఆశీస్సులు ఉన్నాయనే అనుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
అరటాకులో భోజనం ఎందుకు మంచిదో తెలుసా?
30 ఏళ్ల కష్టాన్ని.. అర్థ గంట లో దోచేశారు..!
పూజా హెగ్డే తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
వర్మను కలిసిన బిగ్ బాస్ హాట్ బ్యూటీ!