Saturday, May 18, 2024
- Advertisement -

ఒకే జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎంఎల్ఏల‌కు నో టికెట్స్‌…

- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లె అభ్య‌ర్తుల విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఈసారి చాలా మంది సిట్టింగ్‌ల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని బాబు ఖ‌రాఖండీగా చెప్పారంట‌. అదికూడా ఒకే జిల్లాకు చెందిన నేత‌లు కావ‌డంతో పార్టీ మిగితా నాయ‌కుల‌కు గుబులు మొద‌ల‌య్యింది.

అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబు మొండిచేయి చూప‌నున్నారు. వారిపై వ‌స్తున్న ఆరోప‌న‌ల‌తో కొత్త వారికి టికెట్లు ఇచ్చేందుకు బాబు నిర్ణ‌యించ‌డంతో జిల్లా రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఒకేసారి ఐదుగురు సిట్టింగులకు టిక్కెట్ల కేటాయింపులో మొండిచేయంటే ఆషా మాషీ విష‌యం కాదు.

వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్, అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల ఎంఎల్ఏలపై వ్యవహారశైలిపై చంద్రబాబుకు బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉందట. అంద‌రి మీద ఆరోప‌న‌లు రావ‌డంతోనే వారంద‌రినీ వ‌చ్చె ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్ట‌నున్నారు చంద్ర‌బాబు. అందుకే వారి స్థానంలో కొత్త వారిని చేర్చుకున్నారు బాబు.

శింగనమలలో ఎంఆర్పిఎస్ నేత ఎంఎస్ రాజును ఇటీవలే పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రి కాలువ శ్రీనివాసులే రాజును దగ్గరుండి చంద్రబాబు సమక్షంలో పార్టీలోకి చేర్చారు. అనంతపురం నియోజకవర్గంలో ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరి విషయంలో పార్టీలో పెద్ద గందరగోళమే నెల‌కొంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇప్పిస్తామ‌నే హామీతో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబు స‌మ‌క్ష‌లో వైసిపినేత గుర్నాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకున్నారు. దాంతో చౌదరి భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది.

ఇక కల్యాణదుర్గంలో తనకు బదులుగా తన కొడుకు లేదా కోడలుకు టిక్కెట్టు ఇవ్వాలంటూ ఎంఎల్ఏ హనుమంతరాయ చౌదరి ఇప్పటికే చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. అయితే, చంద్రబాబు మాత్రం పై ఇద్దరి విషయాన్ని పక్కనబెట్టి బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వర్ రావు వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

గుంతకల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ జితేందర్ గౌడ్ కు టిక్కెట్టు దక్కేది అనుమానమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గం నుండి పోయిన ఎన్నికల్లో గెలిచిన మంత్రి కాలువ వచ్చే ఎన్నికల్లో గుంతకల్ నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారట. మం అలాగే, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డికి టిక్కెట్టు అనుమానమే అని పార్టీ వర్గాలంటున్నాయి. ఇలా ఒకే జిల్లాకు చెందిన సిట్టింగ్‌ల‌కు టికెట్లు నో చెప్ప‌డంతో మిగిలిన జిల్లాల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌నేది నాయ‌కుల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యిందంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -