మరో నియోజకవర్గంలో టిడిపి ఔట్… టిడిపి కీలక నేతలు వైకాపాలో చేరిక

స్పీకర్‌గా చేసిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చరిత్ర తెలుగునాట ఉంది. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచీ కేవలం వందల ఓట్ల తేడాతో గెలిచిన కోడెల శివప్రసాదరావుకు కూడా ఈ సారి ఓటమి భయం పెట్టుకుందా? 2014ఎన్నికల్లో తాను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందో స్వయానా కోడెల శివప్రసాదరావే ఆ మధ్య ఓ ఇంటర్యూలో చెప్పేశాడు. కోడెలపై అప్పట్లో ఎన్నికల సంఘం కూడా యాక్షన్స్ తీసుకునేదిశగా కదిలింది. ఆ తర్వాత ఏం మేనేజ్‌మెంట్ జరిగిందో కానీ ముందుకు సాగలేదు.

ఆ విషయం పక్కనపెడితే రీసెంట్‌గా తన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కోడెల ట్యాక్స్ అంటూ వైఎస్ జగన్ ఓ స్థాయిలో విమర్శలు చేశాడు. సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపికి వచ్చిన వందల ఓట్ల మెజారిటీ ఈ సారి కచ్చితంగా రాదని చెప్పి ఇప్పటికే సర్వేల్లో తేలిపోయింది. ఈ నియోజకవర్గంలో 2019ఎన్నికల్లో టిడిపికి ఓటమి ఖాయమని తేల్చేశారు.

ఇప్పుడు టిడిపి ఓటమిని ఖాయం చేస్తూ సత్తెనపల్లి టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెనపల్లి మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానిక నాయకులతో కలిసి వచ్చి జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ చేరికతో సత్తెనపల్లిలో 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే ఛాన్సే లేదని స్థానిక టిడిపి నాయకులే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ మించి సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థానిక వ్యాపారస్తులను, ప్రజలను టిడిపి నాయకులు పీడించుకుతిన్నారని……ఆ ఫలితం 2019ఎన్నికల్లో తప్పకుండా అనుభవిస్తారని ప్రజలు చెప్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్రకు రాయలసీమలో ……కడపలో వచ్చిన స్థాయి స్పందన సత్తెనపల్లిలో కనిపిస్తూ ఉండడం చూసి మీడియా పెద్దలు కూడా ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు.