Thursday, May 9, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీల‌కు క్లాస్ పీకిన చంద్ర‌బాబు…

- Advertisement -

పార్టీ ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు క్లాస్ పీకారు. అఖ‌లిప‌క్ష సామావేశంలో నేత‌లు ఎంపీల‌పై బాబుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర‌ప్ర‌జ‌లు ఢిల్లీకి వెల్లిన‌పుడు అక్క‌డి ఎంపీలు స‌హ‌క‌రించ‌డంలేద‌ని స‌మావేశంలో కొందురు ప్ర‌స్తావించారు. ఉదయం ఎంపీలతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్ లో గుర్తు చేసిన చంద్రబాబు ఎంపీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తన ఇమేజ్ ను, పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసేలా కొందరు ఎంపీలు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, ఇటువంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. ఢిల్లీకి వచ్చి తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యతని గుర్తు చేసిన ఆయన, ఏపీ భవన్ ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలని సూచించారు.

ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ఆర్థిక మంత్రి జైట్లీతో రహస్య సమావేశాలు జరుపుతోన్న ఎంపీ సుజనా చౌదరి వ్యవహారంపై టీడీపీ వర్గాలు చర్చించాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని, ఇకపై ఎవరితోనూ రహస్యంగా మతనాలు జరపొద్దని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

ఎంపీలంద‌రూ కేంద్ర‌మంత్రుల‌ను ర‌హ‌స్యంగా ఎవ‌రూ క‌లుసుకోవ‌ద్ద‌ని ఎంపీల‌కు హిత‌వు ప‌లికారు. ఈ విషయంలో ఎంపీలంతా జాగ్రత్తగా ఉండాలని, వారి చర్యలను అందరూ గమనిస్తున్నారని, మీడియా ముందు, విపక్షాల ముందు పరువు తీసేలా ప్రవర్తించ వద్దని హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -