పవన్ సైలెంట్ మిషన్ లో చిక్కునున్నఅంబటి !

Pawan Kalyan Silent Mission to target Ambati Rambabu
Pawan Kalyan Silent Mission to target Ambati Rambabu

పవన్ అంబటి రాంబాబు ను టార్గెట్ చేశారా ? అంబటి కి అవినీతి మరకలు అంటించేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నారా ? అంబటి పై పవన్ సైలెంట్ మిషన్ సక్సస్ అయిందా ? ప్రస్తుతం ఈ ప్రశ్నలపై ఏపీ పాలిటిక్స్ లో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాయిస్ ఆఫ్ జగన్ గా అంబటి రాంబాబు కు పేరుంది. ప్రత్యర్థి పార్టీ నేతలపై అంబటి వేసే పోలిటికల్ సెటైర్స్ , విమర్శలు అన్నీ కూడా తరచూ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఎలాంటి నాయకుడినైనా తన విమర్శలతో ఇట్టే ఇరుకున పెట్టేస్తారు అంబటి. ఇక గత కొన్ని రోజులుగా అంబటి జనసేనాను గట్టిగానే టార్గెట్ చేశారు. పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తు పోలిటికల్ హిట్ పెంచుతున్నారు. .

అయితే పవన్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నప్పటికి.. పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. అందుకే అంబటి దూకుడుకు అడ్డుకట్ట వేయడమే తాన మొదటి టార్గెట్ గా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల సత్తెనపల్లి లో అంబటి పై పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలే సృష్టించాయి. మంత్రి హోదాలో ఉండి కూడా నియోజిక వర్గ ప్రజలను అంబటి లంచలతో పీడిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన 5 లక్షల ఆర్థిక సాయంలో అంబటి 2.50 లక్షలు లంచం అడిగారని పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

పవన్ వ్యాఖ్యాలకు రియాక్ట్ అయిన అంబటి.. తను లంచం తీసుకున్నానని నిరూపిస్తే.. మంత్రి పదవితో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంబటి సవాల్ ను స్వీకరించిన జనసైనికులు.. ఏకంగా భాదితులను మీడియా ముందు ప్రవేశపెట్టి అంబటికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. భాదితులు అంబటి లంచం అడిగినట్లు మీడియా ముందు కూడా స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా అంబటి ఇరుకున పడిపోయారు. లంచం అడిగినట్లు నిరూపించినందుకు అంబటి ఇచ్చిన మాట ప్రకారం తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలని జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది. దాంతో ఊహించని పరాభవం ఎదురుకావడంతో అంబటి పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైందని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ రోజుగా జరుగుతోంది. మొత్తానికి ప్రతి విషయంలో పవన్ పై వ్యంగ్యస్త్రాలు సందించే అంబటికి.. పవన్ తన సైలెంట్ మిషన్ తో చెక్ పెట్టారనే చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

కే‌సి‌ఆర్ జగన్ దోస్తీ.. ఇదే అసలు వ్యూహమా ?

తెలుగువాళ్ళంటే.. ఎందుకంత చిన్న చూపు !

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !