Friday, May 17, 2024
- Advertisement -

క‌ర్నూలు టీడీపీలో…నాలుగు స్తంభాలాట‌

- Advertisement -

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కోట్ల కుటుంబం టీడీపీలో చేర‌నుంద‌నే వార్త‌ల‌తో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. క‌ర్నూలు సీటు విష‌యంలో నాయ‌ల‌కుల మ‌ధ్య తీవ్ర మైన పోటీ నెల‌కొంది. టీజీ వెంక‌టేష్‌, కోట్ల‌, కేయీ, ఎస్వీ మ‌ధ్య నాలుగు స్తంభాలాట జ‌రుగుతోంది. సీటును ఎవ‌రికి కేటాయించాలో తెలియ‌క కొట్టుమిట్టాడుతున్నారు బాబు.

కోట్ల టీడీపీలో చేరాలంటే క‌ర్నూలు ఎంపీ స్థానంతో పాటు ప‌త్తికొండ‌, డోన్‌, ఆలూరు నియోజ‌క వ‌ర్గాల‌ను కేటాయించాల‌ని బాబుకు ష‌ర‌తు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే బాబు దీనిపై ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కోట్ల కుటుంబాన్ని వ్య‌తిరేకిస్తోంది కేఈ కుటుంబం. ప‌త్తికొండ‌, డోన్ రెండు నియోజ‌క వ‌ర్గాల‌ను మాకుటుంబానికే కేటాయించాల‌ని కేఈ ప‌ట్టుబ‌డుతున్నారు. ఒక వేల కోట్ల టీడీపీలో చేరితే బాబు సీటు ఎవ‌ర‌కి కేటాయిస్తారోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాశంగా మారింది.

కోట్ల టీడీపీలో చేరితే కేఈ కుటుంబం మ‌రో ఎత్తుగ‌డ వేస్తోందిఎస్వీ మోహన్ రెడ్డికి చెక్ పెట్డడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేరుతాయనే ఉద్దేశంతో వారున్నట్లు తెలుస్తోంది. కర్నూలు సీటును సుజాతకు కేటాయించి, తమకు డోన్ సీటు ఇవ్వాలని వారు కేఈ బ్రదర్స్ చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది. కర్నూలు లోకసభ స్థానాన్ని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చినా ఫరవాలేదని వారన్నట్లు తెలుస్తోంది.

ఇద‌లా ఉంటే బాబుకు ఇప్పుడు టీజీ వెంక‌టేష్‌నుంచి కొత్త త‌ల‌నొప్పి మొద‌ల‌య్యింది. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాశంగా మారింది. క‌ర్నూలు నుంచి పార్లమెంటు సభ్యుడు టీజీ వెంకటేష్ తన కుమారుడు భరత్ కు ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగానే ప్ర‌క‌టించారు. తన కుమారుడు భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతని వైపే టీడీపీ అధిష్ఠానం మొగ్గుచూపుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నారు. ఈయ‌న కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈసీటును ఆశిస్తున్నారు. ఎవ‌రికి క‌ర్నూలు సీటు కేటాయించినా ఇంకొక‌రు బ‌య‌ట‌కు వెల్లాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయి. మ‌రి టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -