Friday, May 17, 2024
- Advertisement -

తెర‌పైకి మ‌రో సారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌..చంద్ర‌బాబుకు నోటీసులు

- Advertisement -

కొద్ది రోజుల క్రింతం ఏపీపై న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం పెద్ద కుట్ర‌చేస్తోంద‌ని ఆప‌రేష‌న్ గ‌రుడ‌ను ప్రారంభింబోతోంద‌ని సంల‌చ‌న వ్య‌ఖ్య‌లు చేశారు శివాజీ. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సారి ఆప‌రేష‌న్ గ‌రుడును తెర‌మీద‌కు తీసుకొచ్చి ఈ సారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌ర్వ‌ర‌లోనే చంద్ర‌బాబు నాయుడికి నోటీసులు వ‌స్తాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగబద్ధ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని ఆయన చెప్పారు. నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని… ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారమని చెప్పారు.

బీజేపీ చేపట్టిన ఆపరేషన్ గరుడ కొత్త రూపం దాల్చుకుని, ఏపీపై దాడికి తెగబడుతోందని శివాజీ తెలిపారు. ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి… మహా అయితే ఓ నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు, లేదా వారం ఆలస్యం కావచ్చని… కానీ చంద్రబాబుపై దాడి మాత్రం తథ్యమని చెప్పారు.

తనకు చంద్రబాబు అయినా, జగన్ అయినా ఒకటేనని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తనకు ముఖ్యమని శివాజీ అన్నారు. ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో… ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -