Monday, April 29, 2024
- Advertisement -

తాడిపత్రిలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

- Advertisement -

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరణదీక్షకు దిగనున్న నేపథ్యంలో.. సోమవారం తాడిపత్రి‌లో భారీగా పోలీసులు మోహరించారు. నగరంలో కవాతు కూడా నిర్వహించారు. అర్ధరాత్రి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

కాగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు వ్యతిరేకంగా ఎమ్మార్వో కార్యాలయం ఎదుట అమరణ దీక్ష చేయనున్నట్టుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన సోదరుడు జేపీ దివాకర్‌రెడ్డి కూడా మద్దతు పలికారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో కొవిడ్‌-19 నిబంధనలు, 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉన్నాయని, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని ఆంక్షలు ఉన్నా నిరసన దీక్షకు వెనుకంజ వేసేది లేదని జేసీ సోదరులు స్పష్టం చేశారు. శాంతియుతంగా దీక్ష చేపడుతామని జేసీ సోదరులు చెబుతున్నారు. అవసరమైతే ఇంట్లోనే దీక్షకు దిగుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో పట్టణంలో హైటెన్షన్‌ నెలకొంది.

కాగా, వారం రోజుల కిందట తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్త‌కు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. ఇక, అప్పటి నుంచి తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరు పార్టీల నేతలు మాటల యుద్దానికి దిగారు.

మరోవైపు జేసీ బ్రదర్స్ దీక్షపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల గురంచి జేసీ బ్రదర్స్ మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జేసీ బ్రదర్స్ పొలిటికల్ డ్రామా అని ఆరోపించారు.

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనలో కీలక పరిణామం

అందరి ముందు క్షమాపణలు కోరిన రవి.. ఒక్కటైన లాస్య, రవి

సోషల్ మీడియాలో హాట్ సెల్ఫీలతో కేక పెట్టిస్తోన్న బోల్డ్ బ్యూటీ

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -