Friday, April 26, 2024
- Advertisement -

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనలో కీలక పరిణామం

- Advertisement -

విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు 12 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ అరాచకానికి పాల్పడ్డ దుండగులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మీడియాకు తెలిపారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటన సందర్భంగా రామతీర్థం వచ్చిన జిల్లా ఎస్పీ రాజకుమారి ఈ ఘటనకు సంబంధించి మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చేస్తామన్నారు. దీని వెనుక ఎంతటి వారున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు.

అరెస్టు దారుణం: ఎమ్మెల్సీ మాధవ్‌
రామతీర్థం కోదండరాముడి దేవాలయం వద్ద గత వారం రోజులుగా నిరసన చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రామతీర్థంలో కోదండరాముని ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన బీజేపీ, జనసేన భాగస్వామ్యంతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే…
రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో డిసెంబర్ 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు.

విగ్రహాల ధ్వంసంపై ఏపి సీఎం జగన్ సీరియస్ వార్నింగ్!

రామతీర్థం విగ్రహ ధ్వంసంపై ఏపీ సర్కార్ ఊహించని ట్విస్ట్

30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారు? : బండి సంజయ్

లేడీ గెటప్ లో మన హీరోలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -