Wednesday, April 24, 2024
- Advertisement -

బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్‌కు భారీ షాక్?

- Advertisement -

దుబ్బాక ఉపఎన్నిక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు తెలంగాణ బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపింది. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. ఇటు రాష్ట్ర నాయకత్వం పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయగా.. అటు కేంద్రం కేసీఆర్‌కు చెక్ పెట్టే వ్యూహాల్లో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాలంటే ముందు దాని ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలన్న వ్యూహంతో బీజేపీ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కు ఆర్థిక అండదండలు అందిస్తున్నవారిని ఒక్కొక్కరిగా కేసీఆర్‌కు దూరం చేయగలిగితే భవిష్యత్తులో టీఆర్ఎస్ దానంతట అదే పతనమవుతుందన్న వ్యూహం దీని వెనకాల ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇందులో భాగంగానే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు,టీఆర్ఎస్‌కు ఆర్థికంగా అండగా ఉన్న మై హోమ్ రామేశ్వరరావును బీజేపీలోకి లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది. మరికొద్ది రోజుల్లోనే మై హోమ్ రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నారని, ఇందుకు ప్రతిఫలంగా పార్టీ ఆయన్ను రాజ్యసభకు పంపించనుందని నవ తెలంగాణ పత్రిక ఆదివారం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌కు అన్ని విధాలా అండగా ఉంటూ వస్తున్న రామేశ్వరరావుకు ఇటీవల కేసీఆర్‌తో విబేధాలు తలెత్తడం వల్లే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ఆ కథనంలో పేర్కొంది. 2020 జూలైలో మై హోం రామేశ్వరరావు మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం, ఆఫీసుల మీద కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆయన బీజేపీలో చేరాలనుకోవడం వెనుక ఇది కూడా ఓ కారణమనే అభిప్రాయాన్ని నవ తెలంగాణ కథనంలో పేర్కొంది. మరి ఎంత వరకు నిజమో, బీజేపీ వ్యూహానికి కేసీఆర్ చెక్ పెడుతాడో లేదో కాలమే తెలియజేయాలి.

30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారు? : బండి సంజయ్ 

తాడిపత్రిలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

అందరి ముందు క్షమాపణలు కోరిన రవి.. ఒక్కటైన లాస్య, రవి

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనలో కీలక పరిణామం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -