Tuesday, May 21, 2024
- Advertisement -

వంద మంది జాబితా సిద్దం చేసిన జ‌గ‌న్ … వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా…?

- Advertisement -

మే 23న ఆంధ్ర రాజ‌కీయాల్లో కొత్త శ‌కానికి నాంది ప‌లుకుతుంది. వైసీపీ గెలిస్తే మాత్రం ఎప్పుడూ లేని సరికొత్త రాజకీయాలు తెరపైకి వచ్చే అవకాశాలు బ‌లంగా కనిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌జ‌లు జ‌గ‌న్ సీఎం అని డిసైడ్ చేశారు. దాదాపు మెజారిటీ స‌ర్వే సంస్థ‌లు అన్ని వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేశాయి. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నె రాష్ట్ర అభివృద్దితో పాటు ఆయ‌న‌ను ఇబ్బంది పెట్టిన నేత‌ల‌ను టార్గెట్ చేయ‌నున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌ర్వాత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ సొంతంగా వైఎస్ ఆర్ సీపీని స్థాపించారు. పార్టీని స్థాపించి ఎదుగుతున్న క్ర‌మంలో జ‌గ‌న్ ను రాజకీయంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎంతో మంది ప్రముఖ నేతలు, వ్యాపార వేత్తలు, శత్రువులు నరకం చూపించారని భావిస్తున్నారట జగన్. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి జ‌గ‌న్ సీఎం అయితే రాష్ట్ర అభివృద్ధి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సొంత వ్యాపారాలు, కుటుంబ వ్యాపారాలు అన్నింటికీ ప్రాధాన్యం తగ్గించుకొనేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యారు. లేకుంటె టీడీపీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెయ్యలేదంటున్న వైసీపీ… తాను కచ్చితంగా అభివృద్ధి చేసి చూపించాల్సి ఉంటుంది. లేదంటె ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ విమ‌ర్శ‌ల పాలు కాక త‌ప్ప‌దు.

అభివృద్ధిపై జ‌గ‌న్ దృష్టిపెడితే…. శత్రువులు, ప్రత్యర్థుల సంగతి తేల్చే పనిని ఆయనకు అత్యంత నమ్మకమైన అనుచరగణం చూసుకుంటుందని తెలిసింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌కు ముఖ్యంగా రాజ‌కీయశ‌త్రువు చంద్ర‌బాబు. పదేళ్లుగా జగన్‌ను చాలా మంది టార్గెట్ చేశారు. లక్ష కోట్లు మింగేశారని విమర్శించారు. 30 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటూ రాద్ధాంతం చేశారు. అదే ప‌బ‌ద్దాన్ని పదే ప‌దే ప్ర‌చారం చేసి ఒక విధంగా బాబు విజ‌యం సాధించారు.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె బాబుపై పెండింగ్‌లో ఉన్న కేసుల‌ను తిరగదోడతారన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఒక లిస్ట్ రెడీ అయ్యింద‌ని దాంట్లో 100 పైగా ప్రముఖుల పేర్లు ఉన్నాయని లోటస్ పాండ్ నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇద‌లా ఉంటె జ‌గ‌న్ సీఎం అయితే ముందు ఎవ‌రు టార్టెట్ అవుతారోన‌ని టీడీపీనేత‌ల్లో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -