Friday, May 17, 2024
- Advertisement -

పాదయాత్ర చేశాడు, పదేళ్ళకు పైగా పాలించాడు…. కానీ బాబుకు ప్రజా సమస్యలు తెలియదుః పవన్

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు. ఆ తర్వాత పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు. అదే టైంలో పాదయాత్ర అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు తిరిగాడు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా దాదాపు నాలుగేళ్ళ కాలం పూర్తి చేసుకోబోతున్నాడు. అయినప్పటికీ చంద్రబాబుకు ప్రజా సమస్యలు ఏం తెలియవా? చేనేతలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగుల కష్టాలు ఏంటో చంద్రబాబుకు తెలియదా?

చంద్రబాబుకు ఆయా ప్రజల కష్టాలు ఏవీ తెలియవనే తన చర్యల ద్వారా చెప్తున్నాడు నట నాయకుడు పవన్ కళ్యాణ్. తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఉన్న ప్రజల దగ్గరకు వెళ్ళి కలుస్తూ…..వాళ్ళ సమస్యలు తెలుసుకుని…..ఆ సమస్యలు పరిశీలించి, అధ్యయనం చేసి ఆ తర్వాత చంద్రబాబు దగ్గరకు తీసుకెళితే…..అప్పుడే చంద్రబాబు ఆ సమస్యలు పరిష్కరిస్తాడట. పవన్ కళ్యాణ్ టూర్‌లో ఆయన చెప్తున్న మాటల అంతరార్థం ఇది కాదని ఎవరైనా చెప్పగలరా? 2009 ఎన్నికలకు ముందు నుంచీ ఇప్పటి వరకూ కూడా చాలా సార్లు పొలిటికల్ కమెడియన్ అని అనిపించుకున్నాడు పవన్. ఇక పిచ్చోడన్న ట్యాగ్ కూడా గట్టిగా తగిలించుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబును కూడా చేతకానివాడిగా ప్రజలకు నిరూపించే ప్రయత్నంలో ఉన్నట్టున్నాడు పవన్. ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం….ధశాబ్ధంపైగా ముఖ్యమంత్రి, దశాబ్ధం పాటు ప్రతిపక్షనేత…….అయినప్పటికీ బాబుకు ప్రజా సమస్యలు తెలియట్లేదా? ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అధికార యంత్రాంగం మొత్తం ఏం చేస్తున్నట్టు? పంచాయతీ స్థాయి వరకూ ఉన్న ఉద్యోగ వ్యవస్థ మొత్తం నిద్దరోతోందా? మీట నొక్కితే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమస్యలన్నీ తన డ్యాష్ బోర్డ్‌లో కనిపిస్తాయని చంద్రబాబు ఆ మధ్య తన భజన మీడియాతో ఘనంగా ప్రకటించాడుగా. అదంతా హంబక్కేనా?

రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్ళు ఎవరైనా రెండు నిమిషాలు విచక్షణతో ఆలోచిస్తే పవన్ కళ్యాణ్-చంద్రబాబుల గేం ఈజీగా అర్థమైపోతుంది. ఉద్ధానం కిడ్నీ బాధితుల ప్రచార స్టంట్స్ అన్నీ కూడా ఆచరణలోకి ఒక్కశాతం కూడా రాలేదన్న విషయం కూడా ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా ఆడిన డ్రామాతోనే అర్థమైంది. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న షో……ఆ షోను రసవత్తరంగా నడిపిస్తున్న పచ్చ బ్యాచ్………మరోసారి జనాలను నమ్మించగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -