Sunday, April 28, 2024
- Advertisement -

హైకోర్టు జగన్ సర్కార్ మద్య ఏం జరుగుతోంది ?

- Advertisement -

ఏపీ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది.. ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతున్నప్పటికి.. ఇంకా చాలా వాటిలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్, హైకోర్టు వంటి వాటితో జగన్ సర్కార్ కు అడప దడప షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఆ మద్య పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు జగన్ సర్కార్ మద్య జరిగిన వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైకోర్టు మరియు జగన్ సర్కార్ మద్య కూడా ఉప్పు నిప్పు వైఖరి కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ సర్కార్ కు సంబంధించిన చాలా నిర్ణయాలను హైకోర్టు వ్యతిరేకించడమే ఇందుకు కారణం.

ఆ మద్య పంచాయతీ రంగుల విషయంలో జీవో 623 ను రద్దు చేస్తూ షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఇక అప్పటి నుంచి జగన్ సర్కారు కు వరుస షాక్ లు ఇస్తూనే ఉంది. సినిమా టికెట్ ధరల విషయంలో కూడా జగన్ ప్రభుత్వానికి భిన్నంగానే తీర్పునిచ్చింది హైకోర్టు.. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది హైకోర్టు.. అమరావతి రైతుల సమస్యలు పరిష్కరింత వరకు మూడు రాజధానులు అమలు చేసే ప్రసక్తే లేదని స్టే విధించింది. దాంతో మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే విధంగా ఉంది.

ఇక తాజాగా అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు హైకోర్టు ను ఆశ్రయించిన జగన్ సర్కార్ కు.. మళ్ళీ షాక్ ఇచ్చింది ధర్మాసనం,.. అమరావతి రైతుల పాదయాత్రను రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వపు తరుపు పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది . పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలు కూడా జారీచేసింది. ఇలా ఇవన్నీ పరిశీలిస్తే మొదటి నుంచి కూడా జగన్ సర్కార్ నిర్ణయాలపై హైకోర్టు షాక్ ఇస్తూనే ఉంది. మరి జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలలో లోపం ఉందా ? లేదా హైకోర్టు జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిందా ? అనే ప్రశ్నలు ఇప్పుడు పొల్లిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

టీడీపీ, బీజేపీ లను పవన్ కలుపుతారా ? జనసేనాని ఏం చేయబోతున్నాడు ?

హిందూ రాజకీయం.. మోడీకి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ !

బీజేపీకి పవన్ పంచ్ గట్టిగా తాకిందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -