Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ తో కే‌సి‌ఆర్ పొత్తు.. ఇంతకీ రాహుల్ నిర్ణయం ఏంటి ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఇటీవల దసరా రోజున టి‌ఆర్‌ఎస్ పార్టీ ని బి‌ఆర్‌ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి బి‌ఆర్‌ఎస్ చుట్టూ ఎన్నో ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కే‌సి‌ఆర్ అటు జాతీయంగానూ, ఇటు రాష్ట్రియంగానూ ఒంటరి పోరు చేస్తారా ? ముఖ్యంగా జాతీయ స్థాయిలో పార్టీతో పొత్తుకు సై అంటారా ? ఇలాంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. కాగా కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ఇతర పార్టీలతో పొత్తుకు సిద్దమే అనే సంకేతాలు కూడా ఇచ్చారు కే‌సి‌ఆర్. అయినప్పటికి ఏ ఏ పార్టీలు బి‌ఆర్‌ఎస్ తో కలవడానికి ముందుకు వస్తాయి అనే దానిపై క్లారిటీ లేదు..

అయితే కేంద్రంలో కాంగ్రెస్ తో బి‌ఆర్‌ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఆ మద్య వార్తలు వినిపించాయి. ఇక తాజాగా కే‌సి‌ఆర్ తో పొత్తు విషయమై రాహుల్ గాంధీ స్పందించారు. కే‌సి‌ఆర్ తో కలిసే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. అటు కేంద్రం లోనూ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కే‌సి‌ఆర్ తో ఎట్టి పరిస్థితుల్లో చేతుకు కలపబోమని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టి‌ఆర్‌ఎస్ కొద్ది మందికీ మాత్రమే లాభం చేకూరుస్తున్నాయని, మోడి, కే‌సి‌ఆర్ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని రాహుల్ మండి పడ్డారు. ఉప ఎన్నికకు వందల కోట్లు ఖర్చు చేయడానికి అంతా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్నా భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ పై విధంగా స్పందించారు. మొత్తానికి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కే‌సి‌ఆర్ తో కలిసే ప్రసక్తే లేదనే విషయం స్పష్టమైంది.

ఇవి కూడా చదవండి

హిందూ రాజకీయం.. మోడీకి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ !

అందరి చూపు జనసేన వైపు.. పవన్ ప్లానెంటి ?

కుప్పంలో అరాచకం ఎవరిది.. చంద్రబాబు దా ? జగన్ దా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -