Friday, May 17, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌లో భాగంగా నిమ్మ‌కూరులో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ‌న్‌…టీడీపీలో ప్ర‌కంప‌న‌లు

- Advertisement -

ఆంధ్రాలో అధికార తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు ప్రతిపక్ష నేత జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ జిల్లాగా పేరు మారుస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట చేశారుపేరును జిల్లాకు పెడతామని చెప్పారు.

ఈ ప్రకటన రాజకీయవర్గాలను షేక్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది. అయినా ఆ పార్టీకి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ఆలోచన రాలేదు. కనీసం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయాల‌న్న ధ్యాస చంద్ర‌బాబు నాయుడికి గానీ, ఎన్టీఆర్ వార‌సుల‌కు గాని లేక పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.

వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీని షేక్ చేయడం ఖాయమంటున్నారు విశ్లేష‌కులు. ఒకవైపు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయనను దింపి పారేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గతంనుంచీ అటు వైఎస్ రాజశేఖరరెడ్డి కానీ, ఇటు జగన్ కానీ పదే పదే ప్రచారం చేస్తున్నారు.

తాజాగా జగన్ చేసిన ప్రకటన సరికొత్త చర్చను లేవనెత్తింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపి అంటే రెడ్ల పార్టీ అని, టిడిపి అంటే కమ్మ పార్టీ అన్న ముద్ర ఉంది. కానీ కమ్మలంతా టిడిపికి లేకుండా చేయడం కోసం వైసిపిఈ స్టెప్ తీసుకుందా అన్న చర్చ ఉంది. ఎందుకంటే కమ్మల్లో ఎన్టీఆర్ అభిమానులంతా టిడిపి పక్షాన లేరనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో చంద్రబాబును వ్యతిరేకించే కమ్మలందరినీ జగన్ అక్కున చేర్చుకునే ప్రయత్నంగా చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ను అభిమానిస్తూ.. చంద్రబాబుకు వ్యతిరేకులుగా ఉన్న కమ్మ కులస్థులందరినీ ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రకటన చేసి ఉండొచ్చని చెబుతున్నారు. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -