Thursday, March 28, 2024
- Advertisement -

గెలుపుపై బుల్లెట్ గురిపెట్టిన కేటీఆర్‌…సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ దూసుకు పోతోంది. దాదాపు అన్ని చోట్లా ఆధిక్యంలో దూసుక‌పోతోంది. ఓట్ల లెక్కింపు కొన్ని క్ష‌ణాల ముందు కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో చేతిలో గన్ పట్టుకొని గురి పెట్టారు కేటీఆర్. ఎన్నికల్లో టీఆర్ఎస్ గురి తప్పదని…తమదే విజయం అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. కేటీఆర్ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

పూర్తి ఆత్మవిశ్వాసంతో గెలుపుపై గన్‌తో గురిపెట్టి బుల్లెట్ దిగిందా? లేదా? అన్నట్టుగా ఉన్న ఫొటోని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాకు ఫ్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు కేటీఆర్. మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ ఫొటో షేర్ చేయడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

100 స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ అంటే.. అంతకు మించి సీట్లు సాధిస్తామని కేటీఆర్ ఢంకా బజాయిస్తున్నారు. అటు ప్రజాకూటమి నేతలు సైతం గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్ ఫలితాలు తలకిందులవుతాయని.. లగడపాటి సర్వే ఫలితాలు నిజమవుతాయని నమ్ముతున్నారు.

దేశ ప్రధాని.. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి.. ఆరు రాష్ట్రాల సీఎంలు.. 11 మంది కేంద్ర మంత్రులందరూ కలిసి టీఆర్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. రేపటి గెలుపు కేటీఆర్‌దే’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న కేటీఆర్ ఫొటోని షేర్ చేశారు కేటీఆర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -