Friday, May 17, 2024
- Advertisement -

లగడపాటి-బాబు మీటింగ్…. సర్వేనే కాదు…. షాకులు, ట్విస్టులు కూడా

- Advertisement -

లగడపాటి సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్ళ మధ్య హాట్ టాపిక్ అవుతోంది. లగడపాటి సర్వేకు వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపుకు కూడా ముడిపెట్టడంతో ప్రజల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. లగడపాటి-చంద్రబాబు మీటింగ్ అయిన వెంటనే బాబు భజన మీడియా సంస్థలన్నీ కూడా లగడపాటి సర్వేలో మరోసారి టిడిపినే గెలుస్తుందన్న నిజం తేలిందని వార్తా కథలు వడ్డించి వార్చాయి. ఆ వెంటనే……..అవునా…….నిజమా……జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా వైకాపాదే గెలుపు, జగనే సిఎం అని తేల్చేస్తూ ఉంటే……ఆ సర్వేల కంటే నాదే గొప్ప సర్వే అని చెప్పుకునే లగడపాటి సర్వేలో టిడిపి ఎలా గెలుస్తుందని అప్పట్లో సర్వత్రా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు అసలు విషయం బయటపడింది. లెక్కలు కరెక్ట్‌గా ఇలానే ఉంటాయా? కొంచెం అటూ ఇటూ అవుతాయా అన్న విషయం పక్కన పెడితే 2004 నాటి పరిస్థితులే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయని డైరెక్ట్‌గా చంద్రబాబుతోనే లగడపాటి చెప్పిన మాట నిజం అని తెలుస్తోంది. ఈ విషయాన్ని లగడపాటినే పిచ్చాపాటిగా మీడియా వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. 2004లో చంద్రబాబు గురించి ప్రజలు ఎలా భావించారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

ఇక సీట్ల విషయంలో కూడా పశ్ఛిమగోదావరి, అనంతపురంలాంటి చోట్ల పరిస్థితులు కళ్ళకు కడుతూనే ఉన్నాయి. ఓడిపోతాను అన్న భయంతో సాక్షాత్తూ సిఎం సొంత జిల్లా చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్నారు గళ్ళా అరుణకుమారి. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఇక సర్వేలు కూడా టిడిపి ఓటమిని చెప్పేస్తూనే ఉన్నాయి. తాజాగా లగడపాటి సర్వేలెక్కలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. అయితే చంద్రబాబుకు మరీ ఎక్కువ కోపం తెప్పించడం ఎందుకు అని చెప్పి……ఓటమి వరకూ సున్నితంగా చెప్పి సీట్ల లెక్కల విషయంలో కాస్త మేనేజ్ చేశాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే సీట్ల లెక్కలు పక్కనపెడితే 2004లో చంద్రబాబుపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇప్పుడు కూడా చంద్రబాబుపై అదే స్థాయి వ్యతిరేకత ఉందని మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు. నాడు వైఎస్ అధికారంలోకి వచ్చినట్టుగానే 2019లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నది లగడపాటి సర్వే టీం కూడా చెప్తున్నమాట. ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు చేస్తున్న పోలవరం డ్రామాలు, పబ్లిసిటీ స్టంట్స్, బిజెపిని బూచీగా చూపించడం లాంటివి చంద్రబాబును కాపాడడం కష్టమే అన్న విషయం అయితే తేటతెల్లమవుతోంది. మరి ముందు ముందు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తాడో….. లేక 2004 ఎన్నికల్లో జరిగినట్టుగానే మరోసారి విపక్ష పాత్రకు పరిమితమవుతాడో చూడాలి.

మొత్తం  175 ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్థానాలలో
వైకాపా : 103
టీడీపీ :    66
జన సేన :  6
జిల్లాలవారీగా
1. శ్రీకాకుళం(10):         వైకాపా : 6 టీడీపీ : 4
2. విజయనగరం (9):      వైకాపా : 4 టీడీపీ : 5
3. విశాఖపట్నం (15):     వైకాపా : 7 టీడీపీ : 8
4. తూర్పు గోదావరి (19): వైకాపా : 8 టీడీపీ : 9  జన సేన : 2
5. పశ్చిమ గోదావరి (15): వైకాపా : 7 టీడీపీ : 4  జన సేన : 4
6. కృష్ణ (16) :               వైకాపా : 9 టీడీపీ : 7
7. గుంటూరు (17) :        వైకాపా : 8 టీడీపీ : 9
8. ప్రకాశం (12) :            వైకాపా :10 టీడీపీ: 2
9. నెల్లూరు (10):            వైకాపా : 7 టీడీపీ : 3
10. వైఎస్ఆర్ కడప (10):వైకాపా : 9 టీడీపీ : 1
11. కర్నూలు (14):         వైకాపా :10 టీడీపీ : 4
12. అనంతపురం (14) : వైకాపా : 8  టీడీపీ : 6
13. చిత్తూరు (14) :        వైకాపా : 10 టీడీపీ : 4

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -