సొంత నేతల దెబ్బ.. జగన్ కు గట్టిగా తాకిందా ?

Leaders Rebelled against YSRCP Headache to YS Jagan
Leaders Rebelled against YSRCP Headache to YS Jagan

అధికార వైసీపీలో అతర్మదనం మొదలైంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి ఇప్పటినుంచే వైసీపీలో అసమ్మతి జ్వాలలు రగులుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలలోను విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్న జగన్ కు తాజా పరిణామాలు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఆ మద్య ఆనం నారాయణరెడ్డి జగన్ పై మరియు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేసి పోలిటికల్ హిట్ పెంచారు. ఇక తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వైసీపీకి వైఎస్ఆర్ కు తానెంతో విధేయుడనని చెప్పుకుంటూనే పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. .

తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఇదంతా జగన్ కు తెలియకుండా జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, అవమానం జరిగిన చోట తాను ఉండలేనంటూ పార్టీ విడుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో 35 ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురి అవుతున్నాయని ఇదంతా జగన్ కు తెలియకుండా జరుగుతుందా అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలపై వైఎస్ఆర్ పార్టీ పెద్దగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపించడం లేదు. పార్టీలోనుంచి వెళ్ళే వాళ్ళను చూసి జగన్ భయపడడు కొడాలి నాని వంటి వారు చెబుతున్నారు.

అయితే తాజా పరిణామాలు మాత్రం వైసీపీకి కొంత దేబ్బే అని విశ్లేషకుల వాదన. ఎందుకంటే పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు వైసీపీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా ప్రభుత్వ లొసుగులను ఎత్తిచూపిస్తూ జగన్ ప్రభుత్వానికి మేకుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. అయితే తాను ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నని ఎంకెవరిని నమ్ముకోలేదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. మరి నేతల తిరుగుబాటుపై జగన్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పరినమలన్నీ కూడా నెల్లూరు కేంద్రంగా జరుగుతున్నాయి. దాంతో నెల్లూరు పాలిటిక్స్ పై వైఎస్ జగన్.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మొత్తానికి వైసీపీలో రగులుకున్న తిరుగుబాటు రాజకీయం జగన్ ను గట్టి తలనొప్పిగా మారిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

లోకేశ్, పవన్ దోస్తీ.. అగేదెలే ?

బడ్జెట్ బాదుడు.. ప్రతిపక్షాల ప్రకంపనలు !

టార్గెట్ ఏపీ.. కేజ్రీవాల్ ప్లాన్ అదే !