- Advertisement -

బడ్జెట్ బాదుడు.. ప్రతిపక్షాల ప్రకంపనలు !

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను తాజాగా పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వరుసగా మూడవసారి కేంద్ర మంత్రి నిర్మలసీత రామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరట కలిగించేలా బడ్జెట్ ను రూపొందించారు. ఈ సారి బడ్జెట్ లో అధిక శాతం సంక్షేమనికే ఎక్కువ నిధులు కేటాయించిన కేంద్రం.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి వాటికి భారీగా కోత విధించింది. ఇదిలా ఉంచితే తాజా బడ్జెట్ పై కమలనాథులు ప్రశంశలు కురిపిస్తుంటే.. ప్రతిపక్ష నేతలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 2023-24 బడ్జెట్ రైతుల,పేదల, మద్యతరగతి వాళ్ళ కలలు నెరవేరుస్తుందని ప్రధాని మోడీ ప్రశంశలు కురిపిస్తే.. ఇది మిత్రకాల బడ్జెట్ అని ఈ బడ్జెట్ కు ఎలాంటి విజన్ లేదంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యస్త్రాలు సంధించారు..

ఈ బడ్జెట్ లో ఉద్యోగులపై దృష్టి లేదని, ద్రవ్యోల్బణం ఎదుర్కోవడానికి ఎలాంటి ప్రణాళిక లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ బడ్జెట్ అంతా కూడా ధనికులకు లాభం చేకూరే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా తనదైన రీతిలో బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. గిరిజనుల, బీసీ సంక్షేమం గురించి ఈ బడ్జెట్ లో పట్టించుకోలేదని, నిత్యవసర ధరలు పెంచి సామాన్యుడి బతుకు దుర్భరం చేయడానికి ఈ తజా బడ్జెట్ మరో ఉదాహరణ అంటూ ఖర్గే తనదైన రీతిలో మండిపడ్డారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా బడ్జెట్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ బడ్జెట్ ఒకవర్గం ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ రూపొందించరాని.. ఇదొక చీకటి బడ్జెట్ అంటూ మమత బెనర్జీ విమర్శించారు.

ఇక ఆధాయ పన్ను రూపంలో డిల్లీ ప్రజలు 1.75 కోట్లు కడితే బడ్జెట్ కేటాయింపులలో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించి డిల్లీ పై కేంద్రం వివక్ష చూపుతోందని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసహనం అసహనం వ్యక్తం చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలపై కూడా ఈ బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలవరం సహ పలు ప్రాజెక్ట్ లకు బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిన విషయమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇక తెలంగాణపై కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ వంటి వాటి ఊసే లేదని, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శిచారు. ఈవిధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్ పై ప్రశంశల కన్నా విమర్శలే అధికంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -