Friday, May 3, 2024
- Advertisement -

లోకేశ్, పవన్ దోస్తీ.. అగేదెలే ?

- Advertisement -

గత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, జనసేన మద్య పొత్తులకు సంబంధింకిన చర్చ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీల అధినేతలు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కేవలం అధికారం మాత్రమే కాకుండా 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీని ఎదుర్కోవడం అంతా ఈజీ కాదని పవన్, చంద్రబాబు లకు బాగా తెలుసు. అందుకోసమే టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేయడం కన్నా కలిసి బరిలోకి దిగితేనే వైసీపీ అడ్డుకట్ట వేయొచ్చని టీడీపీ జనసేన ప్లాన్.. అందుకు తగ్గట్లుగానే పొత్తులకు తాము సిద్దమే అనే స్పష్టమైన సంకేతాలను పవన్ ఇచ్చారు..

ఇక చంద్రబాబు కూడా పవన్ తో కలిసేందుకు ఆసక్తిగానే ఉన్నారు. ఇరువురు పదే పదే భేటీ కావడం కూడా ఇరు పార్టీల మద్య పొత్తు కుదిరిందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే అటు పవన్ గాని, ఇటు చంద్రబాబు గాని పొత్తుల విషయం అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పవన్ బీజేపీతో తమ దోస్తీ కొనసాగుతుందని ఇటీవల చెప్పడం.. కమలనాథులు కూడా పవన్ తమతోనే ఉన్నదని చెప్పడంతో టీడీపీతో పవన్ పొత్తు ఉంటుందా ఉండదా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇదిలా ఉంచితే యువగళం పేరుతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ పాదయాత్రలో భాగంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ను ఉద్దేశించి లోకేశ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటున్నారని, ఆయన వారాహి పై ఏపీలో ఆంక్షలు విధిస్తున్నారని అంటూ.. యువగళం ఆగదు.. వారాహి కూడా ఆగదు అంటూ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చేస్తే టీడీపీలో పవన్ పై సానుకూల భావనే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పవన్ బీజేపీ మైత్రి కొనసాగితే.. టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. టీడీపీతో కలిస్తే ప్రసక్తే లేదని కమలనాథులు ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశారు. ఇక పవన్ కూడా తాము బీజేపీతోనే ఉన్నట్లు ఇటీవల స్పష్టం చేయడంతో టీడీపీ జనసేన పొత్తుపై మళ్ళీ అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం అందువల్ల.. 2014 మాదిరిగానే ఎన్నికలు వచ్చే సమయానికి మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదని కొందరి వాదన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మోడీ పాలనపై.. ప్రజా నాడీ ?

కేజ్రీవాల్ చూపు.. ఏపీ వైపు ?

ఎవరు మీలో సి‌ఎం ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -