Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు తెరవెనుక రాజకీయ డ్రామాలపై విరుచుకుపడ్డ అఖిలప్రియ

- Advertisement -

నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబు నాయకత్వ అనుభవానికి అతి పెద్ద పరీక్ష ఎదురైనట్టే కనిపిస్తోంది. అత్యంత పిన్న వయసు మంత్రిగా బాబు కేబినెట్‌లో కొనసాగుతున్న అఖిల ప్రియ చంద్రబాబుకు బిగ్గెస్ట్ సవాల్ విసిరింది. 2019 ఎన్నికల నాటికి భూమా కుటుంబాన్ని సైడ్ లైన్ చేసి టీజీ వెంకటేష్ కుమారుడికి, ఎవి సుబ్బారెడ్డికి టికెట్స్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఆలోచనలను పసిగట్టిన అఖిలప్రియ చంద్రబాబు తెరవెనుక రాజకీయ డ్రామాలకు ఘాటుగా చెక్ చెప్పింది.

కర్నూలు ఎమ్మెల్యే సీటు నుంచి భూమా నాగిరెడ్డి మామ ఎస్వీ మోహనరెడ్డిని తప్పించి ఆ సీటుకు టీజీ వెంకటేష్ కుమారుడికి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు చంద్రబాబు. ఇక ఆళ్ళగడ్డ సీటును ఎవి సుబ్బారెడ్డికి ఇవ్వాలనేది బాబు ప్లాన్. అఖిలప్రియను నంద్యాల నుంచి పోటీ చేయించాలనుకుంటున్నాడు. నంద్యాలలో అఖిల ప్రియకు సీటు ఇస్తున్నాడు కాబట్టి మిగతా రెండు సీట్లలో భూమా కుటుంబం ప్రచారం చేసి ఆయా అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ఆదేశించాడు. అయితే అఖిలప్రియ మాత్రం మొత్తం మూడు టిక్కెట్స్ భూమా ఫ్యామిలీకి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. ఎవరెవరినో గెలిపించమని చంద్రబాబు ఆదేశించడం……….ఎవి సుబ్బారెడ్డిలాంటి వాళ్ళు యుద్ధానికి దిగినట్టుగా భూమా కుటుంబంపై పగబట్టడం…….ఇలాంటి విషయాలన్నింటినీ చంద్రబాబు ఆడిస్తున్న తెరవెనుక రాజకీయ డ్రామాలుగానే అఖిలప్రియ చూస్తోంది. టిడిపి దూతలుగా వచ్చిన నాయకులతో కూడా ఈ తెరవెనుక డ్రామాలను ఉతికి ఆరేసింది అఖిలప్రియ. తెగేదాక లాగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని…….తేల్చుకోవాల్సింది చంద్రబాబేనని చెప్పుకొచ్చింది. తన తండ్రికి మంత్రి పదవి ఇవ్వకుండా బాధపెట్టిన వైనం, ఆ తర్వాత ప్రత్యర్థులను గెలిపించమని తన తండ్రిపై ఒత్తిడి తీసుకురావడం…..ఆ ఒత్తిడితోనే తన తండ్రి మరణించడం…….ఇత్యాది విషయాలన్నీ గుర్తున్నాయని…….ఇప్పుడు మళ్ళీ ,చంద్రబాబు రాజకీయ డ్రామాలతో అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అగత్యం తమకు లేదని టిడిపి దూతలకు అఖిల ప్రియ చెప్పింది. సీట్ల విషయంలో స్పష్టమైన హామీ వచ్చేవరకూ చంద్రబాబును కలిసి ఉద్ధేశ్యం కూడా లేదని అఖిల ప్రియ ఆవేశంగా రియాక్ట్ అవ్వడంతో బాబు తరపున రాయబారానికి వచ్చిన నేతలు కూడా షాకయ్యారు. 2019 ఎన్నికల దగ్గర పడుతూ ఉన్న నేపథ్యంలో ఒక వైపు ఆర్థిక బలం మెండుగా ఉన్న టీజీ వెంకటేష్‌ని చంద్రబాబు వదులుకునే పరిస్థితిలేదు. అలాగే ఎవి సుబ్బారెడ్డి అర్థబలం, అంగబలం కూడా కావాలనుకుంటున్నాడు చంద్రబాబు. ప్రజల్లో సానుభూతి, కాస్త ప్రజాబలం మినహా వేరే ఏ బలమూలేని అఖిలప్రియనే బలవంతంగా అయినా ఒప్పించాలనుకుంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మార్క్ రాజకీయాలను ముందు ముందు అఖిల ప్రియ ఎంత సమర్థవంతంగా ఎదుర్కుంటుందో లేక అదే చంద్రబాబుకు తలవంచుతుందో చూడాలి మరి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయకత్వ సామర్థ్యంపై టిడిపి నేతల్లోనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. ఒక జిల్లాలోనే ఫిరాయింపు నేతలతో ఈ స్థాయి తలనొప్పులు మొదలయితే ఇక అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితులు కంటికి కనిపిస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో టిడిపి అసమ్మతి నాయకులే టిడిపిని ఓడించడం ఖాయమని ఆ పార్టీ నాయకులే మీడియా ముఖంగా నిరాశతో ప్రకటనలు చేస్తూ ఉండడం పరిస్థితులకు అద్దం పడుతోంది. అత్యాశకు పోయి, జగన్ పార్టీ లేకుండా చేయాలని కలలు కంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు…….ఇప్పుడు తాను తీసుకున్న గోతిలా తానే పడడం ఖాయం అనే సంకటస్థితిలో ఇరుక్కున్నాడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -