Sunday, April 28, 2024
- Advertisement -

నేను నోరు విప్పితే తట్టుకోలేవ్ ఈటెలా.. : మంత్రి గంగుల కమలాకర్

- Advertisement -

టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మంత్రి గంగుల వర్సెస్ ఈటెల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఈ రోజు హుజూరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ సందర్భంగా మంత్రి గంగులపై విరుచుకు పడ్డారు. తనకు మద్దతు తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ప్రభుత్వ నిధులు రావాలంటే తమతోనే ఉండాలని హెచ్చరిస్తున్నారని ఈటల ఆరోపించారు.

అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. బిడ్డా.. అని ఈటల అంటున్నారని, తానూ ఓ బీసీ బిడ్డనేనని అన్నారు. ఏం బెదిరిస్తున్నవా ఈటల రాజేందర్? నువ్వు బెదిరిస్తే ఇక్కడ బెదిరేటోడు ఎవ్వడు లేడు.. బిడ్డా..బిడ్డా అని బెదిరిస్తే అంతకన్నా ఎక్కువ మాట్లాడుతా.

నేనూ బీసీ బిడ్డనే. నీ కన్నా నాకు ఆత్మగౌరవం ఎక్కువ అందుకే నీకు ఇప్పటి వరకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా అన్నారు. నీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉంటే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే సీఎం కేసీఆర్.. ఈటలను బర్తరఫ్ చేశారని చెప్పారు. వ్యక్తిగతంగా పోతే తానూ వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుందని, దానిని తట్టుకోలేవని, అది చాలా భయంకరంగా ఉంటుందని ఈటలను హెచ్చరించారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈటల తనతో మాట్లాడనే లేదని అన్నారు.

కోవిడ్ బాధితులకు అండగా స్టార్ హీరోలు

నాకు సాయం చెయ్యండి.. నా రక్తంలో అలాంటి లోపం ఉంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -