Tuesday, April 23, 2024
- Advertisement -

నాకు సాయం చెయ్యండి.. నా రక్తంలో అలాంటి లోపం ఉంది?

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో లో కంటెస్టెంట్ గా పరిచయమైన వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆరియాన టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా నిలిచింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు ఎన్నో అవకాశాలు వరించాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అరియాన తాజాగా సోషల్ మీడియా వేదికగా బ్లడ్ డొనేషన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించింది.

ఈ సందర్భంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లు మెహబూబ్ దిల్ సే, సయ్యద్ సోహైల్ ర్యాన్‌తో ముచ్చటిస్తూ పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త ఇంటికి మారానని, ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అనగానే తను వ్యాక్సిన్ చేయించుకున్నానని తెలిపారు.ఈ సందర్భంగా వ్యాక్సిన్ చేయించుకున్న వారు 60 రోజులపాటు బ్లడ్ డొనేట్ చేయడానికి కుదరదు కనుక వ్యాక్సిన్ వేయించుకునే వారు ముందుగానే బ్లడ్ డొనేట్ చేసే వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది.

Also read:ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరికి బ్లడ్, ప్లాస్మా ఎంతో అవసరం కనుక ప్రతి ఒక్కరు వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు అధికంగా ఉంటే బ్లడ్ డొనేట్ చేసి మరొకరి ప్రాణాలను కాపాడాలని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు కూడా బ్లడ్ డొనేట్ చేయాలని ఉందని, కాకపోతే తన రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉండటం వల్ల తాను రక్తదానం చేయలేకపోతున్నానని ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసింది.

Also read:టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -