Sunday, May 4, 2025
- Advertisement -

సైకిల్ మీద మంత్రి.. పరుగులు తీసిన జనాలు..!

- Advertisement -

ఖమ్మంలో నత్తనడకన నడుస్తున్న పనుల పట్ల మంత్రి అజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి పనులు కొనసాగింపు కుదరదని పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలో ఉదయం పూట… కలెక్టర్‌ కర్ణన్‌, నగర కమిషనర్‌ అనురాగ్​తో కలిసి సైకిల్​పై తిరుగుతూ పనులను పరిశీలించారు. జడ్పి సెంటర్‌, చర్చికాంపౌండ్‌, శ్రీనివాసనగర్‌, మూడవ పట్టణ ప్రాంతం, డిపో రోడ్డు, ఎన్నెస్టీ రోడ్​లో చేపట్టిన రహదారి వెడల్పు, డ్రైనేజీ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు.

ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని అజయ్​ సూచించారు. అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నగర అభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన రూ. 30 కోట్లు.. బడ్జెట్‌లో కేటాయించిన రూ. 150 కోట్లతో ఖమ్మంలోని అన్ని రోడ్లు, డ్రైన్లు పక్కగా నిర్మించి… నగరాభివృద్ధిని ప్రజల కళ్లముందు ఉంచుతామని మంత్రి తెలిపారు.

దారుణంగా తెలంగాణ పరిస్థితి.. ఏకంగా 2 వేలు..!

అమర జవాన్ కి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల!

నేటి పంచాంగం, బుధవారం (7-4-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -