Wednesday, April 24, 2024
- Advertisement -

దారుణంగా తెలంగాణ పరిస్థితి.. ఏకంగా 2 వేలు..!

- Advertisement -

కరోనా రెండో దశ తెలంగాణను చుట్టుముట్టేస్తోంది. మొదటి దశ కన్నా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోజురోజుకూ కొవిడ్ వ్యాప్తి మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో 2 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1,914 మంది కొవిడ్ బారిన పడగా.. వైరస్ సోకి ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,617 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ప్రస్తుతం 11 వేలు కరోనా క్రియాశీలక కేసులు దాటాయి. 6,634 మంది హోం ఐసోలేషన్​లో ఉన్నారు. మరో 285 మంది కోలుకున్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో 393 మంది కొవిడ్ బారినపడ్డారు. రాష్ట్రంలో సోమవారం రోజు 74,274 మంది కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకున్నారు.

ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచిస్తున్నా.. చాలా వరకు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలానే కొనసాగితే.. సెకండ్ వేవ్ కరోనాను తెలంగాణ అధిగమించడం కష్టంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

అమర జవాన్ కి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల!

6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా

నేటి పంచాంగం, బుధవారం (7-4-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -