Wednesday, April 24, 2024
- Advertisement -

అమర జవాన్ కి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల!

- Advertisement -

చత్తీస్‌ఘడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మావోయిస్టులు బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో తలదాచుకున్నారన్న సమాచారంతో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ చేస్తుండగా ఎదురుగా వచ్చిన మావోయిస్టులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా టారెమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగాయి. కొంత మంది కనిపించకుండా పోయారు.

అయితే ఈ ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మరణించారు. కోబ్రా కమాండో రాకేష్ సింగ్ మావోయిస్టుల బందీగా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో వందలాది మంది అశ్రు నయనాల మధ్య అంతిమఘట్టం ముగిసింది. వీర జవాన్‌కు పోలీసులు అధికార లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

అంతకుముందు మురళీకృష్ణ భౌతికకాయానికి పోలీసులు నివాళులర్పించారు. తాజాగా సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలు చెక్కు విడుదల చేసింది. కాగా, ఈ చెక్కును ఈరోజు ఉదయం 10.30 గంటలకు గుడిపూడి గ్రామంలో మృతుని తండ్రి శాఖమూరి రవీంద్ర బాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, తాసిల్దార్ ఎస్ వి రమణ కుమారి, అందించనున్నారు.

నేటి పంచాంగం, బుధవారం (7-4-2021)

ఈ ‘పుడింగి నెంబర్ 1’ ఆ ఇద్ద‌రితో ఏం చేస్తాడో మ‌రి !

6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -