Saturday, April 27, 2024
- Advertisement -

దివ్యాంగుల కోసం మంచు లక్ష్మి ఏం చేస్తుందో తెలుసా?

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదే సమయంలో సామాన్యులతో పాటు అనేకమంది దివ్యాంగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికోసం మంచు లక్ష్మీ ప్రసన్న ఓ గొప్ప పని చేస్తుంది. ఏకంగా 100 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 28న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.

క్రీడా రంగంలో రాణించాలనుకుంటున్న దివ్యాంగులకు సాయంగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు మంచు లక్ష్మి ప్రకటించింది. అయితే ఈ అద్భుతమైన ఆలోచన తన తండ్రితో ఇటీవల మాల్దీవులకు వెళ్లినపుడు వచ్చిందని అన్నారు. పుట్టుకతోనే కొందరు అలా ఉంటే, ఇంకొందరు మధ్యలో వివిధ కారణాల వల్ల దివ్యాంగులుగా మారారు. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. దివ్యాంగులకు సాయం చేసే చాలా సంస్థలు కరోనా సమయంలో ఇబ్బందుల్లోకి వెళ్లిపోయాయి.

అందరికీ స్ఫూర్తి నింపేలా ఉండటానికి 100 కిమీల సైక్లింగ్‌ చేయబోతున్నాను. ప్రజల్లో అవగాహన పెంచడానికి నా ప్రయత్నం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.  ప్రజల్లో అవగాహన పెంచడానికి నా ప్రయత్నం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.” అని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా స్పందించింది.. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ కోసం మంచు వారమ్మాయి ఈ మంచి పని చేస్తోంది.

షర్మిల పార్టీ ప్రయత్నాలపై మంత్రి గంగుల గరంగరం..!

పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

ఇద్ద‌ర‌మ్మాయిల ముద్దుల పెళ్లి.. షాకైన ఇరు కుటుంబ స‌భ్యులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -