Thursday, May 16, 2024
- Advertisement -

’నియ్యమ్మ మొగుడికి…‘… జన్మభూమిలో టిడిపి ఎమ్మెల్యే వారి బూతు పంచాంగం

- Advertisement -

ఓ వైపు చంద్రబాబుగారేమో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం……అక్కడికక్కడే ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే జన్మభూమి కార్యక్రమం అని బాకా ఊదుతూ ఉంటాడు. మరోవైపు ప్రజలు మాత్రం పూర్తిగా రివర్స్‌లో మాట్లాడుతున్నారు. మామూలుగా ఇవ్వాల్సిన వాటిని కూడా ఇవ్వకుండా చేస్తూ…..జన్మభూమి కార్యక్రమం పేరుతో స్టంట్స్ చేస్తున్నారు. ఇక ఆ కార్యక్రమం సందర్భంగా వినతులు ఇవ్వడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్న ప్రజలను టిడిపి నేతలు దారుణంగా అవమానిస్తున్న ఘటనలు అన్నీ ఇన్నీ కావు. మొత్తానికి అధికార మదం తలకెక్కిన టిడిపి జనాలు…….ఆ అధికారం రావడానికి కారణమైన ఓటర్లను మాత్రం బానిసల్లా చూస్తున్నారన్నది నిజం. ప్రతి సమస్యను కూడా టిడిపి నేతలకే చెప్పుకోండి అన్నట్టుగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజలను మరీ రాచి రంపాన పెడుతున్నాయన్నది నిజం. ఈ వీడియో సాక్ష్యంగా టిడిపి నేతల తీరు ఎలా ఉందో మీరే చూడండి.

జన్మభూమి కార్యక్రమం. ప్రజా సొమ్ముతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. అధికారులందరినీ సభకు వచ్చేలా చేశారు. ప్రజలను కూడా భారీగానే తరలించారు. ఆ తర్వాత చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి గంటలు గంటలు ఘనంగా పొగుడుకున్నారు. అప్పటి వరకూ ఎండలో నిల్చుని ఉసూరుమంటున్న జనాల సమస్యలు వినడానికి కాసేపు సమయం కేటాయించారు. ఆ మధ్య అక్రమ ఇసుక దందాను అడ్డుకుందన్న కోపంతో ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టుకుని లాగిన టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వేదికపైనే ఉన్నారు. ఒక ఓటరు తన సమస్య గురించి వేదికపైన ఉన్నవాళ్ళకు చెప్పుకున్నాడు. అంతే చింతమనేని ప్రభాకర్‌కి చిర్రెత్తుకొచ్చింది.

అతనిని హేళన చేస్తూ మాట్లాడేశాడు. అంతటితో ఆగక …..‘ఎవుడికి ఫోన్ చేత్తావురా నియ్యమ్మ మొగుడికి…..నియ్యమ్మ మొగుడికి ఎవుడికి ఫోన్ చేత్తావురా………’ అంటూ రెచ్చిపోయాడు. ఏరా పోరా అనే మాటలైతే సదరు ఎమ్మెల్యే నోటి నుంచి అలవోకగా వచ్చేశాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులే అసలైన సేవకులు……ప్రజలే సిసలైన ప్రభువులు అనేవి చదువుకోడానికి బాగుంటాయి. వాస్తవంలో మాత్రం చింతమనేని లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే…..చంద్రబాబు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే వ్యవహారాలు ఇలానే ఉంటాయి. ఎమ్మెల్యేగారి బూతు పురాణం మీరూ వినండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -