వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అలాగే వైసీపీ నేతలపై టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎప్పుడు కూడా ఘాటైన విమర్శలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లోకేశ్ చేసే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. అయితే లోకేశ్ వ్యాఖ్యలను మొదటి నుంచి లైట్ తీసుకున్న వైసీపీ నేతలు ఈ మద్య తీరు మార్చుకొని లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్లు వేస్తున్నారు. ఇక తాజాగా సిఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ లోకేశ్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. అధికారంలోకి రాక మునుపు ప్రతి ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. ” నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ ఏళ్ళు గడుస్తున్న ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన హామీ ఏమైందని ” లోకేశ్ ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి.. ఇప్పటికీ 150 వారాలు గడిచిన రద్దు చేయనట్టే నంటూ వ్యాఖ్యానించారు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. తమను రెగ్యులర్ చేస్తారని, పనికి తగిన వేతనం కల్పిస్తారని భావించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతూ.. వారి ఉపాధి పైనే వేటు వేస్తున్నారని లోకేశ్ విమర్శలు గుప్పించారు. మరి ఇన్ని హామీలను నిలబెట్టుకోలేని జగన్ రెడ్డి నిన్నెందుకు నమ్మాలయ్యా జనం అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యాలపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఏంటి జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి మీ తండ్రి చంద్రబాబు మోసం చేయలేదా అంటూ కొందరు నెటిజన్స్ లోకేశ్ వ్యాఖ్యలపై కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం లోకేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !