Friday, May 10, 2024
- Advertisement -

పవన్ యాక్టర్ గా సక్సస్.. పొలిటీషియన్ గా ఫెయిల్ !

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల శిల్పాకళ వేధికలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా సభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, దానికి తాను అంగీకరిస్తున్నట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఇక విధంగా చెప్పాలంటే పవన్ నిజం ఒప్పుకున్నారనే చెప్పాలి. 2013 జనసేన పార్టీ స్థాపించి పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.. పార్టీ పెట్టి పదేళ్ళు కావొస్తున్నా ఇంతవరకు బలమైన పార్టీగా గుర్తింపు పొందలేదు. 2014 పరోక్షంగాను, 2019 ప్రత్యేక్షంగాను ఎన్నికల బరిలో దిగిన పవన్ ఏ మాత్రం ప్రభావం చూపలేక చాలా ఘోరమైన ఓటమిని చవిచూశారు.

దీంతో పవన్ రాజకీయాలకు ఏ మాత్రం పనికిరాడనే వ్యాఖ్యలు బలంగానే వినిపించాయి. అయితే సినీరంగంలో తిరుగులేని స్టార్ డమ్ తో నెంబర్ ఒన్ స్థానంలో ఉన్న పవన్ రాజకీయాల్లో మాత్రం తాను పోటీ చేసిన స్థానాల్లో సైతం ఓడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే పవన్ ఓటమికి తాను చేసుకున్నా స్వయంకృత అపరాదమే అని చెప్పక తప్పుదు. ఎందుకంటే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. వారి అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో విఫలం అయ్యాడు. తరచూ ఏదో ఒక పార్టీతో పొత్తులకొరకు పాకులాడడం, రాజకీయాల పట్ల స్థిరమైన నిర్ణయం లేకపోవడం.. ఇవన్నీ కూడా పవన్ ఓటమిని శాసించాయి.

దాంతో పొగుట్టుకున్న చోటే రాబట్టుకునేందుకు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటెందుకు ప్రయత్నిస్తున్నారు పవన్. అందుకే తాను ఎక్కడ తప్పు చేశానో తెలుసుకున్న పవన్ తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని నిరభ్యంతరంగా ఒప్పుకున్నాడు. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.. పవన్ నిజం ఒప్పుకున్నారని, చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నప్పటికి, ఎప్పుడు గెలవలేదని విమర్శించారు. నిన్న నేడు రేపు ఇలా ఎప్పటికీ పవన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గానే మిగిలిపోతారని, ఇందులో డౌటే లేదంటూ అంబటి సెటైర్లు వేశారు. పవన్ సక్సస్ ఫుల్ యాక్టరే తప్పా.. సక్సస్ ఫుల్ పొలిటీషియన్ కానే కాదని అంబటి ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

కే‌సి‌ఆర్ చుట్టూ బిగుస్తున్నా ఉచ్చు.. !

పార్లమెంట్ కు రాహుల్ నో.. జోడో వైపే మొగ్గు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -