Saturday, May 18, 2024
- Advertisement -

జేసీ వర్సెస్ పరిటాల……. బాబుకు బిగ్గెస్ట్ షాక్

- Advertisement -

చంద్రబాబునాయుడితో పాటు ఆయన భజన మీడియా మొత్తం కూడా టిడిపిలో అంతర్గతంగా జరిగే రచ్చను వీలైనంతగా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అయితే అలా మేనేజ్ చేయలేని అంతర్యుద్ధాలు ఇప్పుడు టిడిపిలో చాలానే కనిపిస్తున్నాయి. కర్నూలులో టీజీ వెంకటేష్ కొడుకుతో పాటు, భూమానాగిరెడ్డి మామ సుబ్బారెడ్డికి కూడా కర్నూలు అసెంబ్లీ టికెట్ ఖాయంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు చంద్రబాబు. అందుకే టీజీ కూడా టిడిపి కోసం నంద్యాల ఎన్నికల్లో భారీగా ఖర్చుపెట్టాడు. మరోవైపు భూమా కుటుంబాన్ని కాదనలేని పరిస్థితి. అందుకే నారా లోకేష్ కర్నూలు టికెట్ ఫైనల్ అన్నట్టుగా మాట్లాడితే పెద్ద యుద్ధమే వచ్చింది. అయితే చంద్రబాబు అప్పటికి మాత్రం మేనేజ్ చేయగలిగాడు.

ఇప్పుడు అదే తరహాలో…….ఇంకా చెప్పాలంటే అంతకుమించి అనంతపురంలో అంతర్యుద్ధం జరుగుతోంది. పరిటాల సునీత కొడుకు కూడా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన దందాలు, దాడులపైన కూడా ఆరోపణలు, తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక జేసీల గురించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కూడా ఎక్కువ సీట్లు తమ వర్గానికే కేటాయించాలని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం కంటే ముందు కూడా జేసీ చాలా సార్లు చంద్రబాబును ఓ స్థాయిలో డిమాండ్ చేశాడని టిడిపి నేతలే చెప్తున్నారు. తన కుటుంబ సభ్యులకు, తన వర్గానికి ఎక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయించకపోతే 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపికి మూడు సీట్లు కూడా దక్కవని జేసీ మీడియాతోనే చెప్పేస్తున్నాడు. అప్పనంగా వైఎస్ జగన్‌కి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనుకుంటే చంద్రబాబు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.

మరోవైపు పరిటాల సునీతతో పాటు ఆమె కుమారుడు శ్రీరామ్ కూడా వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ వర్గ జనాలకు కూడా ఒక టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టికెట్లు తాము చెప్పిన వాళ్ళకు ఇస్తేనే అనుచరుల సపోర్ట్ ఉంటుందని, తాము ఆయా అభ్యర్థులను గెలిపిస్తామని లేకపోతే టిడిపి ఓటమి బాధ్యత మా పైన నెట్టవద్దని ఇరు వర్గాలు కూడా చెప్పేస్తున్నాయి. అసలే బాబు రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకుని 2014ఎన్నికల్లో బాబుకు ఓట్లేసిన కరువు జిల్లా అనంతపురం రైతులు, డ్వాక్రా మహిళలు ఈ సారి పూర్తి వ్యతిరేకంగా ఓట్లేయనున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ అంతర్యుద్ధాల గోల కూడా చూస్తుంటే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమిని అనంతపురం జిల్లానే డిసైడ్ చేసేలా ఉందని టిడిపి ఇన్ఛార్జ్ మంత్రి కూడా స్థానిక టిడిపి నాయకులతో ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టికెట్స్ విషయంలో జేసీలు తగ్గే ప్రసక్తే లేదు. జేసీలపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ జేసీలు చెప్పినవాళ్ళకు టికెట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి బాబుది. అదే జరిగితే టిడిపి భారీ దెబ్బ ఖాయం. మరి సంకటస్థితి నుంచి చంద్రబాబు ఎలా బయటపడతాడో చూడాలి. టిడిపిలో చేరినప్పటి నుంచి జేసీల చేత జగన్‌ని తిట్టిస్తూ ఎంజాయ్ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు అదే జేసీలు బ్లాక్ మెయిల్ రాజకీయాలతో చుక్కలు చూపిస్తున్నారు. మొత్తంగా 2019 ఎన్నికల్లో టిడిపి పుట్టి మునిగిపోయేలా చేస్తుండడంపై టిడిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -