జనసేన అధికరంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయా ?

Pawan Kalyan Interesting Comments
Pawan Kalyan Interesting Comments

గత ఎన్నికల ముందు జనసేన పార్టీ నామ మాత్రంగా రాజకీయాల్లో ఉందనే వాదనలు బలంగానే వినిపించాయి. దాంతో పార్టీని బలోపేతం చేయడంలో పవన్ వైఖరిపై గట్టిగానే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎన్నికల తరువాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జనసేన.. గత కొన్ని రోజులుగా రాజకీయ ప్రణాళికల విషయంలో దూకుడు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిత్యం ఏదో ఒక రకంగా ప్రజల్లో ఉండేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు జనసేనాని.

ప్రజా సమస్యలపైనా పోరాడుతూనే పవన్ రాజకీయంగా పరిణితి సాధిస్తున్నారు. గతంలో ఉద్వేగ భరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉత్సాహాన్ని నింపే పవన్.. ప్రస్తుతం ఆచితూచి వ్యాఖ్యలు చేస్తూ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా మంగళగిరి లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కులం, మతం, ప్రాంతీయత ఆధారంగా ముందుకు సాగే పార్టీలు ఎక్కువ రోజులు మనుగడ సాధించలేవని, వాటికి జనసేన అతీతం అని పవన్ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం జనసేన టీడీపీ పొత్తుల విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తను ఇతర పార్టీలను అందలం ఎక్కించేందుకు రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ పార్టీతోను పొత్తు లేదు అనే సంకేతాలను పవన్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పదవుల కోసం ఆశించేవారు పార్టీలోకి రావోద్దని.. ప్రజాసేవే లక్ష్యంగా ఉన్నవారికి మాత్రమే పార్టీ ఆహ్వానం పరుకుతోందని పవన్ తెలిపారు. అంతే కాకుండా జనసేన అధికరంలోకి వస్తే అద్భుతాలు జరగవని, కానీ ఉన్న వ్యవస్థను మరింత పటిష్టం చేసి తీరుతామని పవన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది దసరా నుంచి పవన్ బస్సు యాత్రతో మరింతగా ప్రజల్లోకి వెళ్ళేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. మరి ప్రస్తుతం పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నా జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Also Read

సర్వేల తీర్పు సమంజసమేనా ?

ఆంధ్ర- తెలంగాణ మద్య చిచ్చు.. డైలమాలో జగన్ !

కే‌సి‌ఆర్ ను తక్కువగా అంచనా వేస్తే.. అంతే సంగతులు !