ఇండిపెండెన్స్ డే స్పెషల్ : ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో మనం సాధించిందేంటి ?

దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ వారి దష్యపు సుంకలాలను తెంచి ఎందరో మహానుభావులు 1947 ఆగష్టు 15 మనకు స్వాతంత్య్రన్ని అందించారు. నేటితో మనకు స్వాతంత్ర్యం లభించి ( 2022 ఆగష్టు 15 ) 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మరి ఈ 75 ఏళ్లలో మనం ఏమైనా పురగతి సాధించమా ? అంటే పూర్తిగా సాధించమని చెప్పలేము అలాగే ఏమి సాధించలేదు అని కూడా చెప్పలేము. ఈ గడిచిన ఏళ్లలో మనదేశం ఆర్థిక ప్రగతి విషయంలో ఏ స్థాయిలో దూసుకెళ్తోందో.. ఇంకా చాలా వాటిలో అంతే స్థాయిలో వెనుకంజలోనే ఉంది. మరి మన దేశం ఎందులో ముందుగు దూసుకుపోతోంది ? ఎందులో వెనుకబడింది ? అనే వాటిపై కొన్ని విషయాలను క్లుప్తంగా చర్చించుకుందాం !

ముందుగా మనం సాధించిన కొన్నిటిని పరిశీలిద్దాం
ప్రస్తుతం మనదేశం అత్యంత వేగంగా అధివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ముందువరుసలో ఉంది. ప్రస్తుతం మన దేశం గడిచిన పదేళ్ళలో ప్రతి ఏడాది కూడా 5 శాతానికి ఏ మాత్రం తగ్గకుండా ఆర్థిక వృద్ది రేటు సాధిస్తుందంటే చిన్న విషయం కాదు. ఆర్థిక వృద్ది రేటు ఇలాగే కొనసాగితే ఆర్థికంగా అత్యంతా బలమైన దేశాల జాబితాలో అమెరికా, చైనా, తరువాత మన దేశం నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సాంకేతికంగా కూడా మనదేశం ఎంతో వేగంగా అభివృద్ది చెందింది. ప్రస్తుతం మన దేశంలోని అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో.. ప్రపంచ మేటి దేశాలైన అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలను సైతం తలదన్నే విజయాలు సాధిస్తూ.. ఇతర దేశాలకు మార్గదర్శికంగా నిలుస్తోంది. ఇక సైనిక సామర్థ్యాల విషయంలోనూ మన దేశం అత్యంత పటిష్టమైన దేశంగా పేరుగాంచింది. ఇక ఈ మద్య కాలంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు ( కోవాక్సిన్, కోవిషీల్డ్ వంటివి ) ప్రపంచానికి ఎంతల ఉపయోగ పడ్డాయో మనందరికి తెలిసిందే. రష్యా, అమెరికా వంటి దేశాలు సైతం కరోనాను ఎదుర్కొనేందుకు మన దేశంలో తయారైన వ్యాక్సిన్ పైనే ఆధారపడ్డాయంటే.. వైద్య రంగంలో మనం ఏ స్థాయిలో అభివృద్ది చెందామో అర్థం చేసుకోవచ్చు.

ఇక మనం ఎందులో వెనుకబడ్డమో ఒక సారి చూద్దాం..
మన దేశం అన్నీ రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పటికి.. పూర్తి స్థాయిలో నిరుద్యోగాన్ని అధిగమించడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నాం. 2021 లెక్కల ప్రకారం నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మనదేశం 93 వ స్థానంలో ఉంది. అంటే మనదేశ సగటు జనాభాలో 7.80% నుంచి 7.12 శాతం నిరుద్యోగంతో సతమతమౌతున్నారు.. ఎన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తున్నప్పటికి నిరుద్యోగాన్ని రూపుమాపడంలో మాత్రం మన ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఇక ప్రపంచ పేదరిక దేశాల జాబితాలో మన దేశం 66 వ స్థానంలో ఉంది. ఇక అక్షరాశ్యత విషయానికొస్తే.. 2018 లెక్కల ప్రకారం 74.4 శాతం అక్షరాశ్యత శాతంగా నమోదు అయ్యింది. ఇది కొంత మెరుగ్గానే ఉన్నప్పటికి అక్షరాశ్యతను పూర్తిగా సాధించడంలో ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వాటిలో మనం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకంజలోనో ఉన్నాం.

దీన్ని బట్టి చూస్తే ఈ 75 ఏళ్లలో మనం సాధించింది ఎస్థాయిలో ఉందో.. అంతే స్థాయిలో మనం సాధించాల్సింది కూడా ఉందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది.

Also Read: ఆగష్టు 14: మనదేశానికి నెత్తుటి గాయం చేసిన రోజు..!

Related Articles

Most Populer

Recent Posts