మోడీజీ.. విజన్ 2047 నెరవేరేనా ?

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ( ఆగష్టు 15, 2022 ) జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశగా మారుతున్నాయి. ముఖ్యంగా జాతినుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగానే ఉన్నప్పటికి చాలా వరకు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. 2047 కల్లా దేశం పూర్తిగా అభివృద్ది చెందిన దేశాల జాబితాలో ఉండేందుకు ఒక విజన్ ఆవిష్కరించారు. ప్రతి భారతీయ పౌరుడికి సొంత ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు చేసే విధంగా కొత్త విధానాలు, టెక్నాలజీ పరంగా మరింత పురోగతి సాధింకడం, బుల్లెట్ ట్రైన్లు, భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్స్ కు పెంచడం వంటి ఎన్నో అంశాలను నెరవేర్చేందుకు 2047 వరకు టార్గెట్ గా పెట్టుకున్నట్లు మోడీ ప్రసంగాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే దేశాభివృద్ది విషయంలో ప్రధాని మోడీ ఈవిధంగా చెప్పడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి చాలానే హామీలు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత ఏడాది జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 2022 నాటికి ప్రతి పౌరుడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు కానీ దానిని ఆచరణలోకి పెట్టడంలో మాత్రం విఫలం అయ్యారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా హామీలనే మోడీ గాలికి వదిలేశారు. మరి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి వచ్చే 25 ఏళ్లలో ఐదు లక్ష్యాలతో ముందుకు సాగాలని టార్గెట్ గా పెట్టుకున్న మోడీ 2047 కల్లా స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అయితే మోడీ 2047 టార్గెట్ గా పెట్టుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే 25 ఏళ్లలో కూడా మోదీనే అధికారంలో ఉండాలని భావిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలేన్ని.. నెరవేర్చినవేన్ని అంటూ లెక్కలేస్తున్నారు. మరి 25 ఏళ్ళు కూడా మోడీ పరిపాలననే ఉంటే దేశం మరో శ్రీలంక అవ్వడం ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే నిత్యవసర ధరలు, జి‌ఎస్‌టి వంటి వాటితో ఎన్నో ఇబ్బందులు మోడీ పాలనలో ఎదుర్కొంటున్నారు ప్రజలు.. అలాంటిది మరో 25 ఏళ్ళు కూడా దేశంలో మోడీ పరిపాలననే ఉంటే అభివృద్ది ఎమోగాని దేశం అదొగతి పాలు కావడం మాత్రం ఖాయం అనే చర్చలు జరుగుతున్నాయి. మరి ప్రధాని మోడీ పెట్టుకున్న విజన్ 2047 ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Also Read

ఇండిపెండెన్స్ డే స్పెషల్ : ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో మనం సాధించిందేంటి ?

ఆగష్టు 14: మనదేశానికి నెత్తుటి గాయం చేసిన రోజు..!

మోడీ భవిష్యత్త్ ప్రత్యర్థి.. అతనేనా ?

Related Articles

Most Populer

Recent Posts