సర్వేల తీర్పు సమంజసమేనా ?

ప్రస్తుతం సర్వేలు ఇస్తున్న రిపోర్ట్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ మద్య ఇండియా టీవి నిర్వహించిన సర్వేను మర్చిపోక ముందే తాజాగా ఇండియా టుడే కూడా సర్వే ఫలితాలు వెల్లడించింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి ప్రస్తుతం సర్వేల హడావిడి హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ లో వైఎస్ జగన్, తెలంగాణలో కే‌సి‌ఆర్ మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో వెల్లడించింది. ఇక కేంద్రంలో మరోమారు నరేంద్ర మోడీ అధికారం చేపట్టే అవకాశం ఉందట. ఆ సర్వే లెక్కల ప్రకారం కేంద్రంలో ఎన్డీయే కూటమి 286 సీట్లు కైవసం చేసుకొని అధికారం చేపట్టే అవకాశం ఉందట.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ 8, బిజెపి 6, కాంగ్రెస్ 2 , ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందట. ఇక ఏపీ విషయానికొస్తే.. వైసీపీకి 18, టీడీపీ కి 7 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తెలిపింది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే దాదాపుగా 127 స్థానాలు వైసీపీ కి మొగ్గు చూపే అవకాశం ఉందట. అయితే గత ఎన్నికల్లో 151 సీట్లు కైవసం చేసుకున్న వైఎస్ జగన్ ప్రస్తుతం వస్తున్న సర్వేల ఫలితాలు చూస్తుంటే కొంత వ్యతిరేకత కనబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వేలు పూర్తిగా నమ్మదగినవి కానప్పటికి ఒక అంచనకు వచ్చేందుకు సర్వేలు కొంత ఉపయోగపడతాయి.

మరి వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఉన్న 175 స్థానాలలో విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉన్న వైఎస్ జగన్.. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా అధికారం కోల్పోయిన ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు చెబుతున్నారు. ఇక తెలంగాణ విషయానికొస్తే.. ప్రస్తుతం బీజేపీ జట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. దాంతో టి‌ఆర్‌ఎస్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి సర్వేలు చెబుతున్నా దాని ప్రకారం వైసీపీ, టి‌ఆర్‌ఎస్, ఎన్డీయే లు వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం చేపడతాయా ? లేదా ఊహించని రీతిలో ప్రజాతీర్పు ఉంటుందా ? తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడక తప్పదు.

Also Read

కే‌సి‌ఆర్ ను తక్కువగా అంచనా వేస్తే.. అంతే సంగతులు !

జగన్ సర్కార్ లెక్కలు చూపడం లేదా ?

మోడీ నాయకత్వంలో ఎన్డీయే నాశనం ?

Related Articles

Most Populer

Recent Posts