Friday, April 19, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ ను తక్కువగా అంచనా వేస్తే.. అంతే సంగతులు !

- Advertisement -

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అపార చాణక్యుడు ఎవరయా అంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అని టక్కున చెప్తూ ఉంటారు చాలా మంది. అయితే చంద్రబాబు విషయం అలా ఉంచితే.. తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ కూడా తనదైన రీతిలో రాజకీయ చతురత ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులను ఎదుర్కొనే పదునైన వ్యూహాలు పన్నడంలో సిద్దహస్తుడు అనే చెప్పవచ్చు. కే‌సి‌ఆర్ చతురత గురించి ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు కూడా. క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యర్థికి అంతుచిక్కని ప్రణాళికలు వేస్తూ పైచేయి సాధించడం కే‌సి‌ఆర్ ప్రత్యేకత.

గత ఎన్నికల సమయంలో కే‌సి‌ఆర్ కు చెక్ పెట్టేందుకు అన్నీ పార్టీలు ఏకమైనప్పుడు ఎవరు ఊహించని రీతిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి గ్రాండ్ విక్టరీ సాధించారు కే‌సి‌ఆర్. ఇక ఇటీవల భారీ వర్షాల కారణంగా భద్రాచలం పరిసర ప్రాంతాలలో వరదలు సంబావించినప్పడు కాళేశ్వరం ప్రాజెక్ట్ టాపిక్ బయటకు రాకుండా క్లౌడ్ బరస్ట్ అంటూ టాపిక్ డైవర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రాష్ట్రంలో బీజేపీ హవా బాగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలపై కాకుండా కేంద్ర అధిష్టానం పై విమర్శలు గుప్పిస్తు ప్రజల ఫోకస్ కేంద్ర ప్రభుత్వం వర్సస్ కే‌సి‌ఆర్ పై ఉండే విధంగా చూసుకుంటున్నారు. మరి ఇంత రాజకీయ చతురత ప్రదర్శించే కే‌సి‌ఆర్ మునుగోడు ఉప ఎన్నికల విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. అటు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పాదయాత్రలు, సభలు నిర్వహిస్తు జోరు చూపిస్తుంటే టి‌ఆర్‌ఎస్ మాత్రం తొందరెందుకు అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

అయితే కే‌సి‌ఆర్ మునుగోడు విషయంలో సైలెంట్ గా ఉండడం వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉండే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందే అసెంబ్లీ రద్దు చేసి సాధారణ ఎన్నికలకు కే‌సి‌ఆర్ వెళ్ళే అవకాశం ఉందనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలకు కూడా కే‌సి‌ఆర్ రాజకీయ చతురతపై అవగాహన ఉండదడంతో ముందస్తు ఎన్నికలకు కూడా సిద్దమేనని ప్రకటించాయి. మరి ప్రస్తుతం మునుగోడు చుట్టూ రాజకీయ వేడి కొనసాగుతున్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ సైలెన్స్ వెనుక ఎలాంటి వ్యూహం ఉందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read

రేవంత్ ” సారి”.. వద్దంటున్న కోమటిరెడ్డి !

ప్రధాని పదవిని మోడీ దిగజారుస్తున్నారా ?

లోకేష్ కు యువత అండగా నిలుస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -