Tuesday, May 7, 2024
- Advertisement -

తెరవెనుక పవన్ కళ్యాణ్ చేయాల్సింది చేస్తున్నాడా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాలపై దృష్టి పెట్టారు.. దాదాపు ఐదు సినిమాలు అయన సెట్స్ మీద ఉంచారు.. ఒకదానికొకటి విభిన్నమైన సినిమాలు కావడంతో ఈ సినిమా లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు న్నాయి.. ఇక పవన్ సినిమాలకు వెళ్లడం రాజకీయ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.. అసలే పార్టీ ఒక్కటే సీటు వచ్చిన నేపథ్యంలో ప్రజల్లో ఉండాల్సింది పోయి పవన్ ఇలా సినిమాలు చేసుకోవడం వారికి అసలే నచ్చడం లేదు.. ఒకవైపు ఇతర పార్టీ లు వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం తెగ కసరత్తులు చేస్తున్నారు. కానీ బీజేపీ తో పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా మొత్తం బీజేపీ కి వదిలేయడం వారికి ఏ మాత్రము నచ్చడం లేదట..

ఇకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నా కూడా రాజకీయాలపై అసలు దృష్టి పెట్టలేదు అనుకోవడానికి లేదు అయన తన ఒక కన్ను ను రాజకీయాల్లో ఉంచి అంత గమనిస్తున్నారని అంటున్నారు.. అంతేకాదు పార్టీ ఎక్కడ వీక్ గా ఉందొ కూడా గుర్తించే పనిని మొదలుపెట్టారట.. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ‌్ డిసైడ్ అవడం శుభ పరిణామమే. అలాగే వారి ద్వారా ఇకపైన పార్టీ కార్యక్రమాలు పరుగులెత్తించాలని కూడా పవన్ కల్యాణ‌్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఇక బీజేపీ లో పవన్ జనసేన పై కొంత చులకన భావం ఏర్పడిందని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. వన్ కల్యాణ‌్ గ్లామర్ తప్ప పార్టీ ఎక్కడ ఉందన్న చులకన భావం బీజేపీకి ఉంది. తమది గట్టి పార్టీ అని వారికేదో నమ్మకం కూడా ఉంది. పవన్ కల్యాణ‌్ జనాకర్షణను తమకు అనుకూలంగా వాడుకుని ఆయన పార్టీకి కొన్ని సీట్లు ఇస్తే చాలు అన్న భావనలో బీజేపీ ఉన్నట్లుగా చర్చ అయితే ఉంది. మరి దీని మీద పవన్ కల్యాణ‌్ కి కూడా అనుమానాలు ఉన్నాయో లేక కాషాయదళం వ్యూహాల మీద ఆయనకు కూడా కొత్త ఆలోచనలు వచ్చాయో తెలియదు కానీ జనసేనను కూటమిలో బలమైన పార్టీగా ప్రొజెక్ట్ చేయాలని గట్టిగానే నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  మరి జనసేన మరింత పుంజుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారో చూద్దాం..

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కు నాగబాబు తలనొప్పిగా మారాడా ?

పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్టేనా ?

జగన్ పై గోరంట్ల అసంతృప్తికి కారణం అతనేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -