టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే రికార్డుల వర్షం కురవాల్సిందే. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఏం మాత్రం తగ్గదు. అయితే గత ఎన్నికల సమయంలో సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోనే ఉన్నాడు పవన్. ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయ్యాడు.
అందుకే హిందీలో సూపర్ హిట్ అయినా పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రిమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. త్వరలోనే మిగిత షూట్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత హరిష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నటుడు ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. పవన్ కు ఇష్టమైన నటులు ఒకరు అమితాబ్ బచ్చన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరు అంటే పవన్ కు ఎంతో అభిమానం. చిరంజీవి అంటే పవన్ ఎంత అభిమానిస్తాడో మనం చాలా సందర్భాల్లో చూశాం. ఇక త్వరలోనే పవన్ వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గనబోతున్నాడు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్కైప్‌కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?
