Friday, May 17, 2024
- Advertisement -

రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొన్న ఆస‌క్తి…..

- Advertisement -

ప‌వ‌ణ్-చంద్ర‌బాబు భేటీల‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.గ‌త కొన్ని రోజులుగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే.2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప్ర‌క‌టించారు.ఇప్పుడు ఆక‌స్మాత్తుగా ఈ భేటీ ఎందుక‌నె ఉత్కంఠ నెల‌కొంది.

ప‌వ‌ణ్ క‌ళ్యాన్ కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న ప‌వ‌వ‌ణ్ ఇప్పుడు మ‌ల్లీ బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో అస‌క్తిని రేకెత్తిస్తోంది. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నకల బిజీ షెడ్యూల్లో ఉండి కూడా చంద్రబాబు జనసేన అధ్యక్షుడిని కలవటానికి సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వటం సర్వత్రా ఆశక్తిని రేపుతోంది.

మరో రెండేళ్లల్లో సాధారణ ఎన్నికలుండగా పవన్ అప్పుడప్పుడు చమక్ అంటూ మెరుస్తున్నారు ట్విట్టర్లో. అయితే, ఆమధ్య ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల పరామర్శ పేరుతో కొంత హడావుడి చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అప్పుడప్పుడు ట్విటర్లో స్పందించటం తప్ప జనాల్లోకి వచ్చింది పెద్దగా లేదు.

ఒకవైపు వైసీపీ ప్లీనరీ తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కింది. ఇంకా ఎన్నిక షెడ్యూల్ రాకపోయినా నంద్యాల హీట్ పెంచేస్తోంది. ఇటువంటి నేపధ్యంలో చంద్రబాబు-పవన్ భేటీపై సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా చంద్రబాబు జనసేనానికి ఎందుకు అపాయిట్మెంట్ ఇచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

ఉథ్థానం కిడ్నీ బాధితుల గురించి మాట్లాడటానికి మత్రమే వీరిద్దరూ కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఎవ్వరూ నమ్మటం లేదు. వీరిద్దరి మధ్య కీలక రాజకీయ చర్చలేవో జరగబోతున్నాయంటూ ప్రచారం ఊపందుకుంది. కుల సంఘాల యాత్రలు, నంద్యాలలో మద్దతు, ముద్రగడ వ్యవహారం తదితర అంశాలపై చర్చలుంటాయని ప్రచారం జరుగుతోంది. మరి, చూడాలి సోమవారం భేటీ తర్వాత ఏ విషయాలు బయటకు వస్తాయో.

రేపు అమరావతిలో తనను భేటీ కావాల్సిందిగా కోరారు. కాగా, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై తన పరిశీలనలో తెలుసుకున్న విషయాలను పవన్, చంద్రబాబుకు వివరించనున్నారని, ప్రభుత్వం తరపున వాటర్ ప్లాంట్లు, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు అంశాలపైనా చంద్రబాబుతో చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఇంత బిజీలో కూడా పవన్ కు చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వీరి భేటీలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -