Monday, April 29, 2024
- Advertisement -

ఉగాదికి ఫ్యామిలీ డాక్టర్స్.. రెడీ అంటున్న సి‌ఎం జగన్ !

- Advertisement -

ఏపీలో సి‌ఎం జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా వాలెంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను ప్రవేశ పెట్టిన జగన్ మరో సరికొత్త వ్యవస్థను ప్రజాకు దగ్గర చేసేందుకు సిద్దమయ్యారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్య రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ పేరుతో ప్రతి గ్రామంలోను ఆసుపత్రులను ఏర్పాటు చేయబోతున్నామని గతంలో సి‌ఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు వారి స్వగ్రామంలోనే 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండబోతున్నాయని జగన్ సర్కార్ చెబుతోంది. ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానంపై తాజాగా సి‌ఎం జగన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే ఉగాది నాటికి ప్రతి గ్రామంలోను విలీజ్ క్లినిక్ లు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లలో పని చేసే డాక్టర్లు గ్రామంలోని రోగులను సందర్శిస్తూ ఫ్యామిలీ డాక్టర్స్ వలె పని చేస్తారని సి‌ఎం జగన్ చెప్పుకొచ్చారు.

ఇలా ప్రతి గ్రామంలోనూ ఫ్యామిలీ డాక్టర్స్ అందుబాటులో ఉండడం వల్ల గ్రామాల్లో రోగులకు భరోసాగా ఉంటుందని జగన్ సర్కార్ ఈ ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేసి.. ప్రతి క్లినిక్ ద్వారా రెండు వేలమందికి ఆరోగ్య సేవలు అందించనున్నట్లు జగన్ సర్కార్ చెబుతోంది. అలాగే ప్రతి ఐదు వేల మంది జనాభా కల్గిన చోట హెల్త్ అండ్ వే నెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారట. మొత్తానికి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది జగన్ సర్కార్.

ఇవి కూడా చదవండి

నన్ను తిట్టడమే మీ పనా ?

ట్రైయాంగిల్ ఫైట్.. గుజరాత్ కింగ్ ఎవరు ?

లిక్కర్ క్వీన్ కవిత.. వాట్ నెక్స్ట్ కే‌సి‌ఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -