Friday, May 17, 2024
- Advertisement -

బ్రోక‌ర్ చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మాలా…

- Advertisement -

ప్ర‌త్యేక‌హోదా అంశం ఇప్పుడు సినీఇండ‌స్ట్రీని తాకింది. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌త్యేక‌హోదా అంశంపై అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన మాట్లాడిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచాయి.

ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీపరిశ్రమ మద్దతు తెలపడంలేదని, బస్సుల్లో పడుకుని మరీ సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తుంటే.. టాలీవుడ్‌ వాళ్లు మాత్రం డబ్బు మత్తులో జోగుతున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చారు.

మాకు ఏది చేత‌కాన‌ప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం విజయవాడలో దీక్షకు వచ్చిన సినిమా వాళ్లని లాఠీలతో కొట్టించింది మీరుకాదా, ఒక్కొక్కరినీ తరిమితరిమి కొట్టిన సంగతి మర్చిపోయారా? నిన్నటిదాకా మీరేం మాట్లాడారు.. హోదా కోసం మాట్లాడినవాళ్లను చెత్తవెధవలని అనలేదా? మళ్లీ మీరిప్పుడు సడన్‌గా హోదా కావలంటుంటే మేం మద్దతివ్వాలానీ ప్ర‌శ్నించారు.

హోదా వ‌ద్ద‌ని ప్ర‌త్యేక ప్యాకేజి అని చెబితే న‌మ్మాని…ఇప్పుడు మోడీతో విబేధాలు రావ‌డంతో దాన్ని ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌? అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాటతప్పినవాళ్లను లోఫర్‌ అనేకదా అంటార‌న్నారు. డబ్బులిచ్చి పక్కపార్టీ ఎమ్మెల్యేలను కొనుకుక్కుంటే సంతోషంగా మద్దతు పలకాలా? బ్రోకర్‌ చంద్రబాబు మాటలు నమ్మి మేం పోరాటాలు చెయ్యాలా..’ అని పోసాని ఫైర్‌అయ్యారు.

ఇప్పటికైనా హోదా రావాలంటే ఒకేఒక్క దారి ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ అందరూ విజయవాడ నడిబొడ్డున నిరాహారదీక్షకు దిగాలి. టాలీవుడ్‌ తరఫున నేనూ ఆమరణదీక్షకు కూర్చుంటా. మళ్లీ చెబుతున్నా.. హోదా కోసం ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధం.. టీడీపీ నేతలు కూడా సిధ్దమే అయితే రండి. అలా కాకుండా నోటికొచ్చినట్లు కూస్తే మాత్రం నేను సహించను’’ అని పోసాని అన్నారు. మ‌రి పోసాని మాట‌ల‌కు టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -