Thursday, May 16, 2024
- Advertisement -

భాజాపా – టీడీపీ మ‌ధ్య దూరం పెరుగుతోందా….?

- Advertisement -

ఒకొప్పుడు ఎన్‌డీఏ హ‌యాంలో కేంద్రంలో చ‌క్రం తిప్పిన బాబుకు ఇప్పుడు…మాత్రం చేదు అనుభ‌వాలు ఎద‌ర‌వుతున్నాయి. రాష్ట్రం,కేంద్రంలో క‌ల‌సి ప‌నిచేస్తున్నా మోదీ మాత్రం బాబును దూరం పెట్టార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. రాను రాను మోదీ ద‌గ్గ‌ర త‌న ప్రాభ‌వాన్ని బాబు కోల్పోతున్నారు.

తాజాగా ఢిల్లీలో మ‌రో సారి బాబుకు కేంద్రం షాక్ ఇచ్చింది. తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరికోసం తీసుకున్న అపాయింట్‌మెంట్‌లు తిరస్కరించబడ్డాయని టీడీపీ ఎంపీ ఒకరు తెలిపారు.

గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఈ నేపథ్యంలో మోడీ, చంద్రబాబునాయుడుల మధ్య దూరం పెరిగింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన ప్రతీసారి చంద్రబాబుకు నిరాశే ఎదురవుతోందని పలువురు పేర్కొంటున్నారు.

మ‌రో వైపు భాజాపా ఛీప్ అమీత్‌షా అపాయంట్‌మెంట్ ఇచ్చినా చివ‌రినిమిషంలో తిర‌స్క‌రించ‌డంతో బుబుకు ఎదురు దెబ్బ‌త‌గిలింది. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఏపీకిచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రం అనుకోవడం లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయని రాజ‌కీయ వ‌ర్గాలల్లో చ‌ర్చ‌జ‌రుగుతోంది.

ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అదుకోవాల‌ని మోదీ అపాయంట్ మెంట్‌ దొరికితే ఏపీకి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించాలని సీఎం చంద్రబాబు భావించారు. కాని ఏపీని కేంద్రం ప్ర‌త్యేకంగా చూడ‌టంలేదు. ప్యాకేజిలో ఇచ్చిన హామీలు ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు .పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు, ఈఏపీ ప్రాజెక్టులు, ఇతర ప్రత్యేక ప్రాజెక్టులపై కూడా కేంద్రం స్పందన అంతంత మాత్రమే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పుడే ప‌రిస్థితులు ఇలా ఉంటె మున్ముందు ఎలా ఉంటాయోన‌ని తెలుగు త‌మ్ముళ్ళు ఆందోళ‌న చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -