Tuesday, May 21, 2024
- Advertisement -

అక్టోబర్ 4 వరకు లోకేష్‌ని అరెస్ట్ చేయకండి!

- Advertisement -

ఏపీ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్ 4 వరకు లోకేష్‌ని అరెస్ట్ చేయవద్దని సీఐడీ అధికారులకు సూచించింది న్యాయస్ధానం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు పైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు లోకేష్. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో వాదనలు విన్న న్యాయస్ధానం అక్టోబర్ 4 వరకు అరెస్ట్ చేయవద్దని తెలిపగా పైబర్ నెట్ స్కాంలో ముందస్తు లోకేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ డిస్పోజ్ చేసింది కోర్టు.

బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు. విచారణకు సహకరించాలని లోకేష్‌కు కోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో లోకేష్‌కు 41A నోటీసులు ఇచ్చింది.. ఆ నోటీసులను ఇచ్చేందుకు ఢిల్లీ బయల్దేరింది ఏపీ సీఐడీ. ఈ కేసులో A14గా ఉన్నారు లోకేష్.ఇక ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 4వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

అయితే అక్టోబర్ 4 వరకు లోకేష్‌కు రిలీఫ్‌ లభించినా తర్వాత ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ వీరిద్దరూ అరెస్ట్ అయితే బ్రాహ్మణిని రంగంలోకి దించేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -