ఆంధ్ర- తెలంగాణ మద్య చిచ్చు.. డైలమాలో జగన్ !

Tamil Nadu CM Stalin Shock to AP CM YS Jagan

ప్రస్తుతం ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి అన్నీ వైపులా ఎదురు దెబ్బలు తౌగులుతున్నాయి. మొన్నటి వరకు అప్పుల విషయంలో కేంద్రం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా సి‌ఎం జగన్.. ఇటీవల హాట్ టాపిక్ గా నిలిచిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోతో పార్టీ పరంగా మరో తలనొప్పి వైఎస్ జగన్ ను వెంటాడుతోంది. ఇక తాజాగా మరో రాద్దాంతం జగన్ ను చుట్టుముట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో సి‌ఎం జగన్ చేపట్టిన ప్రాజెక్ట్ లను ఆపాలని తమిళనాడు సి‌ఎం స్టాలిన్.. జగన్ కు లేక రాసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో కొనస్తల నది పై చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల చెన్నైకి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల వెంటనే ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని విరమించుకోవాలని స్టాలిన్ లేఖలో సూచించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇకపై తమతో చర్చలు జరపకుండా ఆనకట్టపై ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టరాదని కోరారట తమిళనాడు సి‌ఎం స్టాలిన్.

ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ మద్య జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇక తమిళనాడు వైపు నుంచి కూడా జల వివాదం మొదలు కావడంతో ఈ సారి పరిణామాలు ఎలా ఉంటాయో అని విశేషకుల్లో కొత్త చర్చ మొదలైంది. మరి ప్రస్తుతం వరుసగా అన్నీ వైపులా నుంచి వైఫల్యాలను ఎదుర్కొంటున్న జగన్ సర్కార్.. ఆంధ్ర తమిళనాడు మద్య రాజుకుంటున్న ఈ ప్రాజెక్ట్ వివాదానికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read

ఏకంగా పి‌ఎం పదవీకే పోటీ.. అందుకే తగతెంపులు ?

కే‌సిఆర్ ఈడీ ట్రాప్ పడతారా ?

జగన్ సర్కార్ లెక్కలు చూపడం లేదా ?