కే‌సిఆర్ ఈడీ ట్రాప్ పడతారా ?

తెలంగాణలో రోజురోజుకు బలపడుతున్న బీజేపీ.. అధికారంలో ఉన్న టి‌ఆర్‌ఎస్ ను దెబ్బకొట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతోందా ? ముఖ్యంగా కే‌సి‌ఆర్ ను అష్టదిగ్బంధం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోందా ? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏకపక్షంగా అధికారంలో కొనసాగుతున్న టి‌ఆర్‌ఎస్ కు ఈ సారి ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికిన వదలడం లేదు కమలనాథులు. ముఖ్యంగా కే‌సి‌ఆర్ ను ఇరుకున పెట్టేందుకు అన్నీ రకాల ప్రణాళికలు వేస్తోంది కమలదళం.

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలుకొని కే‌సి‌ఆర్ కుటుంబ పాలన చేస్తాడనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ సంపాధించిన ఆస్తులపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నుంచి కే‌సి‌ఆర్ అక్రమంగా సంపాధించిన ఆస్తులను బయటపెడితే.. దాని ప్రభావం రాబోయే ఎన్నికల్లో గట్టిగా చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈడీ ని అస్త్రంగా వాడుకుంటూ బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలపై గట్టిగానే ప్రయోగిస్తున్నారు మోడి-అమిత్ శా ద్వయం.

ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ సన్నిహితులు ఈడీ కేసుల్లో ఇరుక్కొగా, 2019 ఎన్నికల ముందు బీజేపీకి హాండ్ ఇచ్చిన చంద్రబాబు కూడా ఈడీ వలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ-టి‌ఆర్‌ఎస్ పార్టీలు ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో కే‌సి‌ఆర్ కు చెక్ పెట్టేందుకు ఈడీని రంగంలోకి దించే పనిలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read

మోడీ భవిష్యత్త్ ప్రత్యర్థి.. అతనేనా ?

లోకేష్ కు యువత అండగా నిలుస్తుందా ?

చంద్రబాబు చేసిన తప్పే.. కే‌సి‌ఆర్ చేస్తున్నారా ?

Related Articles

Most Populer

Recent Posts