మీ మొబైల్ హిట్ అవుతోందా.. అయితే ఇలా చేయండి !

స్మార్ట్ పోన్ వాడే ప్రతిఒక్కరు కచ్చితంగా ఎదుర్కొనే ప్రధాన సమస్య మొబైల్ హీట్ అవ్వడం. గేమ్స్ అధికంగా ఆడుతున్నప్పుడు లేదా కెమెరా ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు మొబైల్ చాలా హీట్ కు గురి అవుతూఉంటుంది. అయితే కొన్ని సార్లు మనం ఎలాంటి గేమ్స్, కెమెరా యూస్ చేయనప్పుడు కూడా మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. ఇలా మొబైల్ హీట్ అవ్వడం వల్ల ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మొబైల్ హిట్ అవ్వడం వల్ల బ్యాటరీపై తీవ్ర ప్రభావం పడి దాంతో బ్యాటరీ అత్యంత త్వరగా పాడవుతుంది. అంతే కాకుండా మొబైల్ పర్ఫమెన్స్ కూడా తగ్గిపోతుంది. హ్యాంగ్ అవ్వడం, డిస్ ప్లే ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మొబైల్ అధికంగా హీట్ అవ్వడం వల్ల పేలిపోయే అవకాశం కూడా ఉంది. మరి ఈ హీటింగ్ సమస్యను సమస్యను ఎలా తగ్గించుకోవాలి అనే దానిపై సింపుల్ ట్రిక్స్ చూద్దాం !

1.ముందుగా మొబైల్ లో ఎక్స్ ట్రిమ్ గేమ్స్ ఆడేవారు చాలా వరకు గేమ్స్ ను లో ఫ్రేమ్ లో ఆడడం మంచిది. ఎందుకంటే ఎక్స్ ట్రిమ్ లో ఆడడం వల్ల ప్రససర్ పై అధిక ఒత్తిడి పడడంతో మొబైల్ విపరీతంగా హీట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల గేమ్స్ ఆడేవారు వీలైనంతా లో ప్రేమ్ లోనే ఆడండి.

2.మొబైల్ హిట్ అవ్వడానికీ మరో కారణం కెమెరా ఎక్కువగా యూస్ చేయడం. మొబైల్ కెమెరా ద్వారా ఎక్కువ సేపు వీడియో రికార్డ్ చేయడం వల్ల మొబైల్ చాలా త్వరగా హీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల మొబైల్ లో చార్జింగ్ పర్సెంటేజ్ 50 కంటే తక్కువగా ఉన్నప్పుడూ వీడియో రికార్డింగ్ వంటివి ఎక్కువ సేపు చేయకూడదు.

3.మొబైల్ లో వైఫై, బ్లూటూత్ వంటివి కంటిన్యూస్ గా ఆన్ లో ఉంచకూడదు. ఇలా ఆన్ లో ఉంచడం వల్ల మొబైల్ అధికంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేస్తూ మిగిలిన సమయాల్లో ఆఫ్ చేయడం మంచిది.

4.బ్యాక్ గ్రాండ్ లో యాప్స్ రన్ కావడం వల్ల కూడా మొబైల్ హీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన యాప్స్ మొబైల్ లో ఉంటే వాటిని ఆన్ ఇన్స్టాల్ చేయాలి.

5.మొబైల్ చార్జింగ్ పెట్టి అలాగే ఫోన్ మాట్లాడడం లేదా గేమ్స్ ఆడడం లేదా వీడియోస్ చూడడం వంటివి చేయకూడదు. ఎందుకంటే మొబైల్ చార్జింగ్ పెట్టినప్పుడు ఆల్రెడీ హీట్ ను జనరేట్ చేస్తుంది. అలాంటప్పుడు మొబైల్ యూస్ చేయడం వల్ల మొబైల్ మరింత హీట్ ను జనరేట్ చేసి చివరకు పేలిపోయే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి మొబైల్ ను చార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో యూస్ చేయొద్దు. వీలైతే మొబైల్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి చార్జింగ్ పెట్టడం మరిమంచిది.

ఇలా కొన్ని సింపుల్ ట్రిక్స్ ద్వారా మన మొబైల్ లో వచ్చే హీటింగ్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

More Like This

ఫోన్ వర్షంలో తడిస్తే ఇలా చేయండి..

మొబైల్ చార్జింగ్ వెంటనే అయిపోతుందా.. అయితే ఇలా చేయండి !

మొబైల్ ఎక్కడైనా మర్చిపోతే ఇలా చేయండి..!

Related Articles

Most Populer

Recent Posts