మహేష్ – పవన్ ఫ్యాన్స్ మద్య మళ్ళీ మొదలైన రచ్చ !

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సినిమాల విషయంలో వీరిద్దరు క్రియేట్ చేసిన రికార్డులపై వీరి ఫ్యాన్స్ మద్య రగడ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో ఇంకొంత మంది టాప్ హీరోస్ ఉన్నప్పటికి పవన్-మహేష్ మద్య ఉండే ఫ్యాన్ వార్ ఎప్పుడు స్పెషల్ గానే నిలుస్తుంది. మరొకసారి ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్ వార్ తెరపైకి వచ్చింది.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. మహేష్ అల్ టైమ్ క్లాసిక్ మూవీస్ అయిన ఒక్కడు, పోకిరి సినిమాలను రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలు విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అల్ టైమ్ రీకార్డ్స్ ను సెట్ చేశారు. ఆల్రెడీ ఓల్డ్ సినిమాలే అయినప్పటికి కొత్త సినిమా రేంజ్ లో వసూళ్లను సాధించాయి. పోకిరి సినిమా విషయానికొస్తే అడ్వాన్స్ బుకింగ్స్ లో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డ్స్ క్రియేట్ చేశారు మహేష్ ఫ్యాన్స్.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. తమ హీరో సినిమా ” జల్సా ” ను పవన్ బర్త్ డే కానుకగా మళ్ళీ రీ-రిలీజ్ చేస్తుండడంతో.. మహేష్ అభిమానులను మించి హంగామా చేయాలని పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. దాంతో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఏది ఏమైనప్పటికి ఈ ఇద్దరి హీరోల క్రేజ్ ఎలా ఉంటుందో మరొకసారి సినీప్రియులకు తెలియజేస్తున్నారు పవన్, మహేష్ అభిమానులు.

Also Read

కార్తికేయ-2 ఎలా ఉందంటే ..?

రాజమౌళి టార్చర్ కు మహేష్ సిద్దమయ్యాడా ?

పాపం.. బాలీవుడ్ ను అమీర్ ఖాన్ కూడా కాపాడలేకపోయాడా ..?

Related Articles

Most Populer

Recent Posts