Friday, April 26, 2024
- Advertisement -

ఏకంగా పి‌ఎం పదవీకే పోటీ.. అందుకే తగతెంపులు ?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిహార్ రాజకీయలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా ఎన్డీయే కూటమిలో భాగమై ఉన్న జేడీయూ ఆ కూటమి నుంచి బయటకు రావడంతో భీహార్ లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. అయితే కేంద్రంలో అధికారంలో బీజేపీని కాదని జేడీయూ బయటకు రావడానికి గల కారణలెంటి ? అనే దానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్నా పరిణామలే బీహార్ లో కూడా చోటు చేసుకునే అవకాశం ఉందన్న అనుమానంతోనే జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాడని కొందరు చెబుతుంటే.. నితీశ్ కుమార్ పక్క ప్రణాళికతోనే ఎన్డీయే కు గుడ్ బై చెప్పాడని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు నితీశ్ కుమార్ ఆలోచన విధానం ఏమై ఉండవచ్చు అనే దానిపై విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ప్రధాన మంత్రి పదవికి పోటీ ఇచ్చే వారిలో బీజేపీ నుంచి నరేంద్ర మోడీ ఉండగా, మిగిలిన పార్టీల నుంచి పి‌ఎం పదవికి చాలా తక్కువ.. కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమత బెనర్జీ, ఆమ్ ఆద్మీ నుంచి కేజృవాల్ వంటి వారితో పాటు కొత్తగా కే‌సి‌ఆర్ కూడా ప్రధానమంత్రి రేస్ లో ఉన్నాడనే చెప్పవచ్చు. ఇక అసలు విషయానికొస్తే.. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా ఎంతో కాలంగా ప్రధాని రేస్ లో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో 2013 లో ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ ని ప్రకటించినప్పుడు.. నితీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు.

అప్పుడు ప్రధాన మంత్రి అభ్యర్థిగా విపక్షాల చూపు నితీశ్ పై పడింది. ఆ తరువాత మళ్ళీ నితీశ్ 2017 లో ఎన్డీయే కూటమి చెంతకు చేరడంతో నితీశ్ కుమార్ ప్రధాన మంత్రి అభ్యర్థి అనే అంశానికి మసకబారింది. ఇక ప్రస్తుతం అయన మళ్ళీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలైన ఆర్ జెడి, కాంగ్రెస్ లతో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో దాంతో రాబోయే ఎన్నికలకు ప్రధానమంత్రి అభ్యర్థి రేస్ లో నితీశ్ కుమార్ మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జేడీయూకు కొన్ని రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే నితీశ్ కుమార్ ఎన్డీయే కు గుడ్ బై చెప్పినట్లు కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

Also Read

ప్రధాని పదవిని మోడీ దిగజారుస్తున్నారా ?

కే‌సిఆర్ ఈడీ ట్రాప్ పడతారా ?

లోకేష్ కు యువత అండగా నిలుస్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -