Friday, May 17, 2024
- Advertisement -

ఆయ‌న చూపు భాజాపా వైపా…. అమీత్‌షా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా…

- Advertisement -

ఉత్త‌రాంధ్ర జిల్లాలో టీడీపీకి మ‌రో సారి షాక్ త‌గ‌ల‌బోతోందా..? టీడీపీ కేంద్ర మంత్రి చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వ‌నున్నారా…? ప‌రిస్థితులు చూస్తుంటె అవుననే అంటున్నాయి. ఉత్త‌రాంద్ర జిల్లా విజ‌య‌న‌గరం టీడీపీకి కంచుకోట‌. అక్క‌డ‌నుంచి టీడీపీ ఎంపీగా అశోక్ గ‌జ‌ప‌తి రాజు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం కేంద్రంలో మంత్రిగా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న త‌ర్వ‌లోనె పార్టీ మారుతార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌త కొంత కాలంగా అశోక్‌గ‌జ‌ప‌తి రాజు బాబు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆయ‌న వ్య‌తిరేకంగా గ్రూపుల‌ను బాబు ప్రోత్స‌హించి ఆయ‌న‌కు ప్రాధాన్య‌త‌ను త‌గ్గే విధంగా పావులు క‌దుపుతున్నారు. అయితే దీనిపై అశోక్ గ‌జ‌ప‌తి రాజు గుర్రుగా ఉన్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌నె చెప్పాలి. మొద‌టినుంచి ఆయ‌న ముక్కుసూటిగా మాట్లాడె వ్య‌క్తి కావ‌డంతో చిన‌బాబు లోకేష్‌కు న‌చ్చంలేదు.

అందుకే కొంతకాలంగా ఆయన్ను టీడీపీ దూరంగా పెడుతూ వస్తోంది. ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనలో అధికారిక కార్యక్రమ వేదికపై అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిథిగా కూర్చోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ హోదాలో లేని వారు అలా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సరైనది కాదని చంద్రబాబు సూటిగా చెప్పడంతో అశోక్‌గజపతిరాజు తీవ్రంగా నొచ్చుకున్నట్టు ప్రతికలో కథనం వ‌చ్చింది.

పార్టీ ఫిరాయింపుల ద్వారా చిరకాల ప్రత్యర్థులైన బొబ్బిలిరాజులను టీడీపీలోకి చేర్చుకోవడం, అనంతరం సుజయ్‌కృష్ణకు మంత్రి పదవి ఇవ్వడం ఇవన్నీ గజపతిరాజుకు చెక్‌ పెట్టే చర్యలుగానే భావిస్తున్నారు. చివరకు విజయనగరం డివిజన్‌లోనూ అశోక్‌గజపతిరాజుకు వ్యతిరేకంగా మంత్రి గంటా శ్రీనివాస్‌రావును నారా లోకేష్ ఉసిగొల్పుతున్న తీరు గజపతిరాజుకు ఇబ్బందిగా మారింది.

టీడీపీ నుంచి పొమ్మ‌న‌లేక పొగ‌బెడ్తుండ‌టంతో అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఉక్కిరిబిక్కిరి అవుతున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఆయ‌న కూతురు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం భాజాపా వైపు చూస్తున్నార‌నె వార్త‌లు వ‌స్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు కుమార్తెకు బీజేపీ కోటాలో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో పాటు… అశోక్‌ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి బాబు ఎలా రియార్ట్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -