Wednesday, May 22, 2024
- Advertisement -

రాజకీయాలంటే వెటకారం.. ప్రజాసేవ అన్నమాటకే అర్థమే లేకుండా పోయింది

- Advertisement -

ప‌చ్చ‌పార్టీనేత‌ల్లో పైత్యం తారాస్థాయికి చేరింది.ప్ర‌జాప్ర‌తినిధుల‌మ‌న్న సంగ‌తి మ‌ర్చిపోయి నీచంగా మాట్లాడ‌టం అల‌వాటుగా మారింది.పసుపుదళం ‘పచ్చ’కామెర్లతో కొట్టుమిట్టాడుతుందనడానికి ఆపార్టీ ఎమ్మేల్యే వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.ప్ర‌స్తుతం నంద్యాల‌లో యధా చంద్రబాబు.. తథా తెలుగు తమ్ముళ్ళు అన్న ప‌రిస్థితి త‌యార‌య్యింది.పార్టీ ఫిరాయింపు నేత ఎస్వీ మోహ‌న్‌రెడ్డి చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.నంద్యాల ఉప ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అంతా నంద్యాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌లు ఉప ఎన్నిక‌మీద తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది.
నాకు ఓటెయ్యకపోతే నేను వేసిన రోడ్ల మీద నడవొద్దు.. నాకు ఓటెయ్యకపోతే నేనిచ్చే పెన్షన్‌ని తీసుకోవద్దు..’ అంటూ నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే పైత్యానికి పరాకాష్ట అనుకుంటే, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేసిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు మ‌రింత ప‌రాకాష్ట‌కు చేరాయి.
నంద్యాలలో వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టడంతో పాటు పలువురికి పదవులు ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఎస్వీ మోహన్‌ రెడ్డి… ఈ పరిస్థితిని చూసి పక్క నియోజకవర్గాల నేతలు, ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే చనిపోతే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారని సభా వేదిక మీద నుంచే చెప్పారు. ఎస్వీ మోహన్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిన వేదికపైనే దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి అఖిల ప్రియ కూడా వున్నారు.
మొత్తం మీద నంద్యాలలో ప్రభుత్వం చేస్తున్న హడావుడి మొత్తం ఉప ఎన్నికల కోసమేనన్న అభిప్రాయాన్ని ఎస్వీ మోహన్ రెడ్డి కూడా సమర్థించినట్టు అయింది. ఇప్పటికే ముస్లిం నేతను ఏవీ సుబ్బారెడ్డి చెప్పుతో కొడుతా అంటూ దూషించిన ఆడియో టేపు కలకలం రేపుతున్న సమయంలోనే ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు టీడీపీకి మరింత ఇబ్బందిగా మారాయి. ఇలా అదికార‌పార్టీనేత‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఉప ఎన్నిక పుట్టిముంచ‌డం ఖాయం అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -